Homeఎంటర్టైన్మెంట్Rajinikanth New Movie Heroine: సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ లో 'కోర్ట్' ఫేమ్ శ్రీదేవి.....

Rajinikanth New Movie Heroine: సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ లో ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి.. బంపర్ ఛాన్స్ కొట్టేసిందిగా..

Rajinikanth New Movie Heroine: అదృష్టం అంటే ఇదేనేమో.. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ పాపులారిటీ ని సంపాదించిన శ్రీదేవి , ఏకంగా నేచురల్ స్టార్ నాని దృష్టిలో పడడం , ఆయన నిర్మాతగా వ్యవహరించబోయే ‘కోర్ట్’ చిత్రం లో ఆమెని హీరోయిన్ గా తీసుకోవడం , అది విడుదలై సంచలన విజయం సాధించడం వంటివి శ్రీదేవి కి జాక్ పాట్ అనే చెప్పొచ్చు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో , ఆమెకు […]

Rajinikanth New Movie Heroine: అదృష్టం అంటే ఇదేనేమో.. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ పాపులారిటీ ని సంపాదించిన శ్రీదేవి , ఏకంగా నేచురల్ స్టార్ నాని దృష్టిలో పడడం , ఆయన నిర్మాతగా వ్యవహరించబోయే ‘కోర్ట్’ చిత్రం లో ఆమెని హీరోయిన్ గా తీసుకోవడం , అది విడుదలై సంచలన విజయం సాధించడం వంటివి శ్రీదేవి కి జాక్ పాట్ అనే చెప్పొచ్చు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో , ఆమెకు అవకాశాలు క్యూలు కట్టాయి. అలా శ్రీదేవి నుండి విడుదలైన రెండవ చిత్రం ‘బ్యాండ్ మేళం’ కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆమెకు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఈ విషయాన్నీ ఆమె పరోక్షంగా చెప్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఒక స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

1991 వ సంవత్సరం లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన తలపతి చిత్రం లోని ఒక ఐకానిక్ ఫోజుని ఇమిటేట్ చేస్తూ స్టైల్ గా నిలబడి శ్రీదేవి ఒక ఫోటో దిగింది. దీన్ని చూసిన నెటిజెన్స్ తావరలోనే కమల్ హాసన్ నిర్మాణం లో రజినీకాంత్ హీరో గా నటిస్తున్న సినిమాలో శ్రీదేవి ఒక కీలక పాత్ర పోషిస్తుందని , ఆ కారణం చేతనే ఆమె ఇలా పరోక్షంగా స్టోరీ ని అప్లోడ్ చేసిందని అంటున్నారు విశ్లేషకులు. ఈమధ్య కాలం లో హీరోయిన్స్ ఇలా క్రియేటివిటీ ని జోడించి పరోక్షంగా హింట్స్ ఇస్తున్నారు. శ్రీదేవి కూడా అలాగే ఇచ్చిందని అంటున్నారు. మరి ఈ విషయం పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇప్పటికే శ్రీదేవి కోలీవుడ్ లో బాగా బిజీ అయ్యింది. కేజీఆర్ సరసన ఆమె ఒక చిత్రం లో నటిస్తోంది.

ఇంతలోపే ఈ క్రేజీ ఆఫర్ ఆమెకు దక్కడం ఆమె లైఫ్ లో సాధించిన పెద్ద అఛీవ్మెంట్ గా చెప్పొచ్చు. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ కి అయినా రజినీకాంత్ సినిమాలో చిన్న రోల్ దొరికితే చాలు అనుకుంటున్నారు. ఎందుకంటే రజినీకాంత్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుంది , విదేశాల్లో ఆయన సినిమాలను ఆడియన్స్ ఎగబడి చూస్తుంటారు, అలాంటి సూపర్ స్టార్ సినిమాలో చిన్న క్యారెక్టర్ దొరికినా చాలు, ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ కి పరిచయం అవుతాము అనే ఉద్దేశ్యం తో , ప్రతీ ఒక్కరు రజిని సినిమాలో నటించాలని కోరుకుంటారు , అలాంటి అవకాశం శ్రీదేవి కి కెరీర్ ప్రారంభం లోనే రావడం చిన్న విశేషం కాదు , దీన్ని ఆమె ఎంత వరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper