Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Tweet On Pawan Kalyan: సీన్ మొత్తం రివర్స్ అయ్యింది అంటూ పవన్ కళ్యాణ్...

Chiranjeevi Tweet On Pawan Kalyan: సీన్ మొత్తం రివర్స్ అయ్యింది అంటూ పవన్ కళ్యాణ్ పై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

Chiranjeevi Tweet On Pawan Kalyan: ‘మన శంకర వరపరసాద్ గారు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కర్ణాటక లో టాప్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గా పేరు తెచ్చుకున్న KVN ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. గత నెలలోనే మొదలు అవ్వాల్సిన ఈ సినిమా, ఇదే సంస్థ లో తెరకెక్కిన ‘జన నాయగన్ ‘ చిత్రం విడుదలకు […]

Chiranjeevi Tweet On Pawan Kalyan: ‘మన శంకర వరపరసాద్ గారు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కర్ణాటక లో టాప్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గా పేరు తెచ్చుకున్న KVN ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. గత నెలలోనే మొదలు అవ్వాల్సిన ఈ సినిమా, ఇదే సంస్థ లో తెరకెక్కిన ‘జన నాయగన్ ‘ చిత్రం విడుదలకు ముందే లీక్ అవ్వడం తో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు నేడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి , ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

అయితే ఈ శుభ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కాసేపటి క్రితమే ఒక ట్వీట్ వేస్తూ ‘నేడు నాకు , కళ్యాణ్ బాబు కి మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే , 30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్ లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది’. అదే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ప్రారంభోత్సవం. నేడు డిప్యూటీ సీఎం హోదాలో తనకు ఉన్నటువంటి విలువైన సమయాన్ని తీసుకొని వచ్చి , నా 158 వ సినిమా ముహూర్తం లో పాల్గొని , మా యూనిట్ మొత్తానికి క్లాప్ ఇచ్చి సభ్యులందరినీ ఆనందపరిచినందుకు ధన్యవాదాలు , లవ్ యూ కళ్యాణ్’ అంటూ చిరంజీవి వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. చాలా కాలం తర్వాత ఈ మెగా లెజెండ్స్ ని ఒకే ఈవెంట్ లో చూడడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

వాస్తవానికి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. మేకర్స్ రామ్ చరణ్ వస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు కూడా, కానీ ఆయన ‘పెద్ది’ మూవీ ప్రొమోషన్స్ లో ఉండడం వల్ల , రాలేకపోయాడని అంటున్నారు. ఒకవేళ రామ్ చరణ్ కూడా వచ్చునంటే మెగా హీరోలందరినీ ఒకే చోట చూసే అదృష్టం అభిమానులకు కలిగి ఉండేది, బ్యాడ్ లక్ , కనీసం ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయినా ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేసే అదృష్టం అభిమానులకు కలుగుతుందో లేదో చూడాలి. ఇకపోతే ఈ చిత్రం అనశ్వర రాజన్ మెగాస్టార్ చిరంజీవి కి కూతురిగా నటించబోతున్న సంగతి తెలిసిందే , ఆమె కూడా నేడు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper