Kalki 2898AD : చిరంజీవి బర్త్ డే పురస్కరించుకుని కల్కి నుండి టీమ్ ఓ వీడియో లీక్ చేసింది. ప్రభాస్ మాస్ అవతార్ ఫ్యాన్స్ లో కాకరేపుతోంది. ఈ మధ్య చిరు లీక్స్ ఫేమస్ అయ్యాయి. చిరంజీవి అలవాటులో పొరపాటుగా తన చిత్రాల కీలక విషయాలు చెప్పేస్తున్నారు. ఆచార్య చిత్ర టైటిల్ అధికారిక ప్రకటనకు ముందే చిరంజీవి చెప్పేశారు. ఇతర హీరోల చిత్రాల ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్లి కూడా ఆయన సినిమా విషయాలు ఫ్లోలో చెప్పేస్తున్నారు. ఈ పొరపాటును అలవాటుగా మార్చుకున్న చిరంజీవి… తన చిత్రాల నుండి లీక్స్ ఇస్తున్నారు.
వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాల నుండి ఆయన కొన్ని లీక్స్ షేర్ చేశారు. నేడు చిరంజీవి బర్త్ డే కాగా ఈ పాయింట్ ఆధారంగా ఆయనకు కల్కి టీమ్ బర్త్ డే విషెస్ చెప్పారు. చిరు లీక్స్ స్ఫూర్తిగా కల్కి 2829 AD నుండి టీమ్ ఓ వీడియో లీక్ చేశారు. సదరు వీడియోలో కళ్ళకు ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ పెట్టుకున్న ప్రభాస్ చేతిలోని గ్యాస్ పైప్ వెలిగించారు. ఈ వీడియోకి బ్యాక్ గ్రౌండ్ గా గ్యాంగ్ లీడర్ మూవీ సాంగ్ మ్యూజిక్ వేశారు.
గ్యాంగ్ లీడర్ మూవీలో చిరంజీవి గ్యాస్ లైటర్ పట్టుకున్న ఐకానిక్ లుక్ ఒకటి ఉంటుంది. అదే తరహా ఓ సీన్ కల్కిలో ఉన్నట్లు టీమ్ చూపించారు. కల్కి నుండి టీమ్ లీక్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది. కల్కి సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే మేకింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెద్ద మొత్తంలో పూర్తి చేయాల్సి ఉంది. దీంతో సంక్రాంతికి కల్కి విడుదల కావడం కష్టమే అంటున్నారు.
కల్కి చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ కాగా… కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక రోల్స్ చేస్తున్నారు. దీపికా పదుకొనె మరొక హీరోయిన్ గా నటిస్తుంది. కల్కి రెండు భాగాలుగా విడుదలయ్యే సూచనలు కలవు. అలాగే ప్రభాస్ సలార్, రాజా డీలక్స్ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది.
https://twitter.com/VyjayanthiFilms/status/1693967982630961275
