Varun Tej-Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఆయనకు ఎంగేజ్మెంట్ అయ్యింది. జూన్ 9న హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. విదేశాల్లో లేదా ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కొన్ని ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. త్వరలో మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజా మోగనుంది.
ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున విడుదల సిద్ధమైంది. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. సాక్షి వైద్య హీరోయిన్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ పాల్గొంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ కి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. లావణ్య-నిహారిక ల నుండి అర్జెంట్ ఫోన్ చెయ్ అని మెసేజ్ వస్తే ఎవరికి ముందు కాల్ చేస్తావని అడగ్గా… నిహారికకే అన్నాడు. ఎందుకంటే తను చిన్నపిల్ల అని సమాధానం చెప్పాడు.
ఇక నీ మొబైల్ ఫోన్లో లావణ్య పేరు ఏమని సేవ్ చేసుకున్నావని అడగ్గా… LAVN అని చెప్పాడు. లావణ్యనే స్వయంగా ఇలా సేవ్ చేసిందని వరుణ్ తేజ్ అన్నారు. మరి లావణ్యకు మీరిచ్చిన మొదటి గిఫ్ట్ ఏంటని అడగ్గా… గుర్తు లేదు. మాది లాంగ్ రిలేషన్. దాని వలన నేనిచ్చిన మొదటి బహుమతి ఏంటో గుర్తు లేదని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. అలాగే మరికొన్ని ప్రశ్నలు ఆయన్ని అడగం జరిగింది.
చిరంజీవి-పవన్ కళ్యాణ్ లలో ఎవరి మేనరిజం ఇమిటేట్ చేయడానికి ఇష్టపడతారని అడగ్గా… వారిద్దరి మేనరిజమ్స్ చూడటానికి ఇష్టపడతానని వరుణ్ తేజ్ చెప్పారు. ఇక పెళ్లయ్యాక రామ్ చరణ్, అల్లు అర్జున్ లలో ఎవరిలో ఎక్కువ మార్పు వచ్చిందని అడగ్గా… పెళ్లయ్యాక ఎవరితోనైనా మార్పు వస్తుందని సమాధానం చెప్పాడు. కాగా గాండీవధారి అర్జున చిత్రంపై వరుణ్ తేజ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఆయన క్లీన్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది.