Brahmanandam And Allu Arjun: మన టాలీవుడ్ లో దాదాపుగా అందరి హీరోలతో లెజండరీ కమెడియన్ బ్రహ్మానందం(Bramhanandam) తో గొప్ప సాన్నిహిత్యం ఉంది. అందరూ ఆయన్ని తమ సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తుంటారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తో బ్రహ్మానందం కి ఉన్న బంధం వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. సినీ ఇండస్ట్రీ కి బ్రహ్మానందాన్ని తీసుకొచ్చింది మెగాస్టార్ చిరంజీవే. అందుకే ఇప్పటికీ బ్రహ్మానందం నేను ఈరోజు ఈ స్థాయిలో మీ ముందు నిల్చున్నాను అంటే అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అని ఎన్నో వందల సందర్భాల్లో చెప్పుకున్నాడు. వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉంటుంది. బయట కలిసినప్పుడు కూడా చాలా సరదాగా ఉంటాడు. అయితే బ్రహ్మానందం కి మెగా ఫ్యామిలీ లో చిరంజీవి తర్వాత బ్రహ్మానందం కి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
తీరిక దొరికినప్పుడల్లా అల్లు అర్జున్(Icon Star Allu Arjun) బ్రహ్మానందం ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఆయనతో కాసేపు సరదాగా మాట్లాడి , సరదాగా గడిపి రావడం అల్లు అర్జున్ కి అలవాటే. బ్రహ్మానందం కూడా ఎన్నో సార్లు అల్లు అర్జున్ కి ఫోన్ చేసి ప్రత్యేకంగా తన ఇంటికి డిన్నర్, లేదా లంచ్ కి పిలిపించుకునేవాడు. రీసెంట్ గా బ్రహ్మానందం తన యూట్యూబ్ ఛానల్ లో అల్లు అర్జున్ కుటుంబం తన ఇంటికి వచ్చినప్పుడు తీసిన కొన్ని ఫోటోలు వీడియో రూపం లో చేసి అప్లోడ్ చేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. చూసేందుకు ఎంత ముచ్చటగా ఉందో, అల్లు అర్జున్ కి బ్రహ్మానందం తో ఎంత గొప్ప అనుబంధం ఉందో ఈ ఒక్క వీడియో ని చూసి చెప్పేయొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.
ఇకపోతే బ్రహ్మానందం ఈమధ్య కాలం లో సినిమాలు బాగా తగ్గించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తో కూడా ఆయన సినిమా తీసి చాలా రోజులే అయ్యింది. వీళ్లిద్దరు కలిసి చివరి సారిగా కనిపించిన చిత్రం ‘సరైనోడు’. మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ ని బయట చూడడమే కానీ, వెండితెర పై చూసే భాగ్యం కలగలేదు ఆడియన్స్. భవిష్యత్తులో అయినా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో చూడాలి. రీసెంట్ గానే బ్రహ్మానందం మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం లో నటించారు. కానీ ఆయన సన్నివేశాలను సినిమా నుండి తొలగించారు. త్వరలోనే ఈ సన్నివేశాలను యూట్యూబ్ లో విడుదల చేయబోతున్నారు మేకర్స్.
View this post on Instagram