Brahmanandam And Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లందరు కమర్షియల్ డైరెక్టర్ కావడం విశేషం… ఆర్ట్ సినిమాలను చేసే వాళ్ళ కంటే కమర్షియల్ సినిమాలను చేసే దర్శకులు టాప్ డైరెక్టర్లుగా ఎదుగుతారనే ఒక నమ్మకం అందరికి ఉంది. ఇక వాళ్లకు మాత్రమే స్టార్ హీరోలు డేట్స్ ఇస్తారు… ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ కమర్షియల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు… ఇప్పుడు ఇలాంటి దర్శకుడు సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు…ఇక అలాంటి దర్శకుడి నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఇక రీసెంట్ గానే ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఇదిలా ఉంటే తన సినిమాలో బ్రహ్మానందం ను మాత్రం తీసుకోవడం లేదు. కారణం ఏంటి అంటే అతనికి సరిపడ క్యారెక్టర్ దొరకడం లేదంటూ ఆయన చెబుతున్నాడు. నిజానికైతే అనిల్ రైటర్ గా ఉన్నప్పుడు బ్రహ్మానందం అతనితో చాలా బాగా క్లోజ్ గా మాట్లాడే వాడట. అతనితో పాటు ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేసేవాడట. ఇక ఈ విజయాన్ని అనిల్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. కానీ బ్రహ్మానందం గారికి సరిపడ క్యారెక్టర్ తన సినిమాలో రావడం లేదని అందువల్లే బ్రహ్మానందం ను తీసుకోలేకపోతున్నాను అంటూ చెప్పాడు.
మొత్తానికైతే ఆయన చెప్పిన వెర్షన్ ఇలా ఉంటే మరి కొంతమంది మాత్రం అనిల్ కి నిజంగా బ్రహ్మానందం ను తీసుకోవాలనే ఉద్దేశ్యం ఉంటే తనకి ఏదో ఒక మంచి కామెడీ సన్నివేశాన్ని రాసి వాడుకోవచ్చు. కానీ బ్రహ్మానందం ను పెట్టుకునే ఉద్దేశం అనిల్ రావిపూడికి లేదని అందువల్లే ఆయన ఏదో ఒక కహానీ చెబుతున్నాడు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు…
ఇక మరి కొంతమంది అయితే అనిల్ రావిపూడికి డైరెక్టర్ జంధ్యాల చాలా ఇష్టం… జంధ్యాలనే బ్రహ్మానందం ను ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. బ్రహ్మానందం సహాయం అడిగితే అతను ఎలాంటి సహాయం చేయలేదట. దానివల్ల జంధ్యాల చాలా వరకు మనస్థాపానికి గురయ్యాడని చెప్పాడు.
ఇక దానివల్లే బ్రహ్మానందం ను అనిల్ రావిపూడి సినిమాలోకి తీసుకోవడం లేదంటూ తన గురువు గారిని పట్టించుకోని బ్రహ్మానందం ను అనిల్ రావిపూడి సైతం పట్టించుకోవడం లేదంటూ కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి…ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి రాబోయే సినిమాల్లో బ్రహ్మానందం ను తీసుకుంటాడా? లేదా కావాలనే అతన్ని స్కిప్ చేస్తాడా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…