Homeఎంటర్టైన్మెంట్Boyapati Srinu Kollywood entry : కోలీవుడ్ లోకి బోయపాటి శ్రీను గ్రాండ్ ఎంట్రీ.. మొదటి...

Boyapati Srinu Kollywood entry : కోలీవుడ్ లోకి బోయపాటి శ్రీను గ్రాండ్ ఎంట్రీ.. మొదటి సినిమానే స్టార్ హీరోతో ఛాన్స్..

Boyapati Srinu Kollywood entry : మన టాలీవుడ్ లో ఊర మాస్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే మన అందరికీ టక్కుమని గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు బోయపాటి శ్రీను(Boyapati Srinu). ఈయన తన సినిమాల్లో హీరోలను సూపర్ హీరోలు గా చూపిస్తాడు. వాళ్లకు ఈయన ఇచ్చే ఎలివేషన్స్ , విలన్స్ ని చితకబాదించే తీరుకి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. జెన్ జీ ఆడియన్స్ ఈయన చిత్రాల్లోని సన్నివేశాలను సోషల్ మీడియా లో […]

Boyapati Srinu Kollywood entry : మన టాలీవుడ్ లో ఊర మాస్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే మన అందరికీ టక్కుమని గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు బోయపాటి శ్రీను(Boyapati Srinu). ఈయన తన సినిమాల్లో హీరోలను సూపర్ హీరోలు గా చూపిస్తాడు. వాళ్లకు ఈయన ఇచ్చే ఎలివేషన్స్ , విలన్స్ ని చితకబాదించే తీరుకి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. జెన్ జీ ఆడియన్స్ ఈయన చిత్రాల్లోని సన్నివేశాలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేసి ట్రోల్ చేస్తుంటారు కానీ , కేవలం అలాంటి సీన్స్ ని చూడడం కోసమే థియేటర్స్ కి కూడా వాళ్ళు వెళ్తుంటారు. రీసెంట్ గా ఆయన నందమూరి బాలకృష్ణ తో తెరకెక్కించిన ‘అఖండ 2’ చిత్రం ఎంత పెద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిందో అందరికీ తెలిసిందే. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి ఫ్లాప్ ఇది.

అయినప్పటికీ బోయపాటి శ్రీను డిమాండ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఈ చిత్రం తర్వాత ఆయన గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి ‘సరైనోడు 2’ చేయాల్సింది. ముంబై కి వెళ్లి అల్లు అర్జున్ తో చర్చలు కూడా జరిపాడు. కానీ ప్రస్తుతం ఆయన వరుసగా రెండు పాన్ ఇండియన్ చిత్రాలు చేస్తుండడం తో , ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాకనే కమిట్మెంట్ ఇవ్వగలనని అల్లు అర్జున్ చెప్పాడట. దీంతో ఆయన తన వద్ద ఉన్నటువంటి మరో పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో కోలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ కోలీవుడ్ హీరో కార్తీ తో ఆయన ఒక మాస్ మసాలా మూవీ ని తీయడానికి సిద్ధం అవుతున్నాడట. రీసెంట్ గానే కార్తీ ని కలిసి స్టోరీ వినిపించగా , ఆయనకు పిచ్చిపిచ్చిగా నచ్చేసిందని , వెంటనే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

ఈ చిత్రం లో బోయపాటి మార్క్ యాక్షన్ తో పాటు, ఫ్యామిలీ డ్రామా కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. తెలుగు , తమిళ భాషల్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని , బోయపాటి శ్రీను పర్ఫెక్ట్ గా తీస్తే, రెండు ఇండస్ట్రీస్ లో సరికొత్త సంచలనాలకు దారి తీస్తుంది ఈ చిత్రం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ?, విలన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది త్వరలోనే అధికారికంగా తెలియనుంది. అయితే యంగ్ హీరోలతో సినిమా తీసి బోయపాటి శ్రీను సక్సెస్ ని అందుకోవడం చాలా అరుదు. ఒక్క అల్లు అర్జున్ మాత్రమే సక్సెస్ అయ్యాడు, మరి కార్తీ పరిస్థితి ఏంటో చూడాలి. కార్తీ ఇప్పటి వరకు మాస్ రోల్స్ చాలానే చేసాడు కానీ , బోయపాటి శ్రీను మాస్ పవర్ కి ఆయన ఎంత మాత్రం అనుతాడో చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper