Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8 : సోనియాని నామినేట్ చేసే ధైర్యం హౌస్ మేట్స్ కి...

Bigg Boss Telugu 8 : సోనియాని నామినేట్ చేసే ధైర్యం హౌస్ మేట్స్ కి లేదా..? బిగ్ బాస్ టీం చెప్తేనే వాళ్ళు అలా చేస్తున్నారా!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ రియాలిటీ షోలోని ప్రతీ సీజన్ లో కొంతమంది కంటెస్టెంట్స్ ని చూడగానే తోటి కంటెస్టెంట్స్ భయపడిపోతూ ఉంటారు. ‘ఆమ్మో..వీడితో ఎందుకు, నామినేట్ చేయకుండా ఉంటేనే బెటర్, వాడికి జోలికి అనవసరంగా పోకూడదు’ అని అనిపించేంత డామినేటెడ్ కంటెస్టెంట్స్ ఉంటారు. కేవలం మగవారిలోనే కాదు, ఆడవాళ్ళలో కూడా ఇలాంటి డామినేటెడ్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఈ సీజన్ లో అలాంటి కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది సోనియా నే అని చెప్పొచ్చు. తనకు తానుగా మొదటి ఎపిసోడ్ లోనే ఆడపులి అని ప్రకటించుకున్న క్యాండిడేట్ ఈమె. చూసేందుకు అందంగా కూడా ఉండడంతో ఈమెపై ఆడియన్స్ లో ప్రారంభం లో ఆసక్తి కలిగింది. కానీ నామినేషన్స్ సమయం లో ఈమె వదిలే మాటలను చూసి ‘అబ్బా..ఏమి మనిషి రా బాబు..అసలు ఇలాంటోళ్ళు కూడా ఉంటారా’ అని అనిపించేలా చేసింది. విష్ణు ప్రియ పై కడుపుమంటతో ఈమె వదిలిన మాటలు వింటే ఎవరికైనా రక్తం మరిగిపోతుంది.

విష్ణు ప్రియ కి తల్లిదండ్రులు లేరు అనే విషయాన్ని తెలుసుకొని, ‘నీకు అయితే ఇంట్లో చూసేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఎలా అయినా ఉంటావు, ఏదైనా మాట్లాడుతావు. కానీ నాకు కుటుంబం ఉంది, ఏది మాట్లాడిన బయటకి ఎలా వెళ్తుంది, మా ఇంట్లో వాళ్ళు ఎలా తీసుకుంటారు అనే భయం ఉంటుంది’ అని మాట్లాడిన మాటలు ఎంత అమానుషంగా ఉన్నాయో మీకే అర్థం అవుతుంది. మనసు ఉన్న మనుషులు ఎవ్వరూ కూడా ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడరు. కానీ సోనియా మాట్లాడింది. ఇలాంటి మాటలు మాట్లాడుతుంది కాబట్టే, ఈమె గురించి ఎన్నో నామినేషన్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా, ఒక్క కంటెస్టెంట్ కూడా ముందుకు వచ్చి నామినేట్ చేయలేకపోతున్నారా?..ఆమె మాటలను తట్టుకునే శక్తి లేక, ఈమెతో ఎందుకు మనకి అని కంటెస్టెంట్స్ ఆమెని నామినేట్ చేసే సాహసం చేయలేకపోతున్నారా అంటే అవుననే చెప్పాలి. గడిచిన రెండు వారాల్లో ఆమెని నామినేట్ చేసేందుకు బోలెడన్ని కారణాలు ఉన్నాయి, కానీ నైనికా తప్పు ఒక్కరు కూడా ఆమెని నామినేట్ చేసే సాహసం చేయలేదు. కనీసం ఫైర్ బ్రాండ్ గా పిలవబడే యష్మీ అయినా నామినేట్ చేస్తుందని అనుకున్నారు ఆడియన్స్.

కానీ ఆమె కూడా నామినేట్ చేయలేదు. కానీ తనని నామినేట్ చేసినప్పుడు మాత్రం యష్మీ సోనియా కి ఇచ్చిపారేసింది. ఈ విషయం లో ఆమెని సోషల్ మీడియా లో నెటిజెన్స్ తెగ మెచ్చేసుకుంటున్నారు. కానీ సోనియా ని కంటెస్టెంట్స్ నామినేట్ చేయకపోవడం పై చాలా కారణాలు ఉన్నాయని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకుంటున్నారు. ఈమె మ్యానేజ్ మెంట్ కోటాపై సంబంధించిన కంటెస్టెంట్ అని, రికమండేషన్, బ్యాక్ గ్రౌండ్ చాలా ఉందని, ఆమెని ఎలిమినేషన్ నుండి కాపాడడానికి, బిగ్ బాస్ టీం కంటెస్టెంట్స్ తో ముందుగా చెప్పి, నామినేట్ చేయకుండా చేస్తూ కుట్ర చేస్తున్నారని అంటున్నారు. కానీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper