Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: పాతాళం కి పడిపోయిన 'బిగ్ బాస్ 10' రేటింగ్స్..రోహిత్ దెబ్బకు...

Bigg Boss 10 Telugu: పాతాళం కి పడిపోయిన ‘బిగ్ బాస్ 10’ రేటింగ్స్..రోహిత్ దెబ్బకు షో ఆగిపోనుందా?

Bigg Boss 10 Telugu: సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కోసం బిగ్ బాస్ టీం ఈ సీజన్ ని సర్వనాశనం చేసిందా?, గత వారం రోజుల నుండి టీఆర్ఫీ రేటింగ్స్ పాతాళంలోకి పడిపోయాయా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. రోహిత్ ఎలిమినేషన్ తర్వాత ఈ సీజన్ కి 50 శాతం కి పైగా రేటింగ్స్ పడిపోయాయి అట. రోహిత్ ఉన్నన్ని రోజులు రేటింగ్స్ 11 రేంజ్ లో ఉండేవట. కానీ ఇప్పుడు కనీసం 5 రేటింగ్స్ రావడం కూడా […]

Bigg Boss 10 Telugu: సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కోసం బిగ్ బాస్ టీం ఈ సీజన్ ని సర్వనాశనం చేసిందా?, గత వారం రోజుల నుండి టీఆర్ఫీ రేటింగ్స్ పాతాళంలోకి పడిపోయాయా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. రోహిత్ ఎలిమినేషన్ తర్వాత ఈ సీజన్ కి 50 శాతం కి పైగా రేటింగ్స్ పడిపోయాయి అట. రోహిత్ ఉన్నన్ని రోజులు రేటింగ్స్ 11 రేంజ్ లో ఉండేవట. కానీ ఇప్పుడు కనీసం 5 రేటింగ్స్ రావడం కూడా కష్టం గా మారిందట. ప్రజలకు పూర్తిగా ఇష్టం లేని నిర్ణయాలు తీసుకుంటే ఫలితం ఇలాగే ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఏ మాత్రం పసలేని కంటెస్టెంట్స్, మూడవ వారం లోనే ఇంటికి వెళ్లిపోవాల్సిన కంటెస్టెంట్స్ అందరూ ఇప్పటికీ హౌస్ లోనే కొనసాగుతున్నారు. కానీ బలమైన కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్, 60 శాతం కి పైగా పబ్లిక్ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ ని మాత్రం ఎలిమినేట్ చేసేసారు.

ఒకప్పుడు అయితే వీళ్ళ ఇష్టానికి తగ్గట్టు వ్యవహరించేవారు కాదు. ఎందుకంటే ఏది చెయ్యాలన్నా ఎండమోల్ షైన్ సంస్థ అనుమతి ఉండాలి. ఎందుకంటే ఈ షో కి ఓనర్స్ వాళ్ళే కాబట్టి. అయితే వాళ్ళ రూల్స్ ప్రకారం ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చెయ్యాలి. భారీ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసేందుకు వాళ్ళు అసలు ఒప్పుకోరు. కానీ గత సీజన్ లో మన తెలుగు బిగ్ బాస్ టీం సొంతంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు సక్సెస్ అయ్యాయి. భారీ రేటింగ్స్ ని రాబట్టాయి. అందుకే ఎండమోల్ షైన్ సంస్థ ఈ సీజన్ లో మీరు ఏది చెయ్యాలని అనుకున్నా మా అనుమతి అవసరం లేదు , మీకు ఇష్టమొచ్చింది చేసుకోండి అని స్వేచ్ఛ ని ఇచ్చాడు. దీంతో మన ‘బిగ్ బాస్’ టీం రెచ్చిపోయింది. రోహిత్ ని నిర్దాక్షిణంగా ఎలిమినేట్ చేసింది.

రోహిత్ ని ఎలిమినేట్ చేయడానికి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఈ సీజన్ కి సెలబ్రిటీలు వచ్చేందుకు అసలు ఆసక్తి చూపలేదు. చివరి నిమిషం వరకు అగ్రీమెంట్స్ మీద సంతకం చేయడానికి ఆలోచించారు. అందుకు కారణం రోహిత్. ‘అగ్ని పరీక్ష 2’ లో ఇతని భీభత్సమైన పెర్ఫార్మన్స్ చూసి ఆడియన్స్ లో తిరుగులేని క్రేజ్ వచ్చింది. టైటిల్ విన్నర్ ఇతనే అన్నట్టుగా ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. దీంతో సెలబ్రిటీలు గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా సామాన్యుడే టైటిల్ విన్నర్ అయ్యేలా ఉన్నాడు , షో కి వెళ్లడం కరెక్ట్ కాదు అని అనుకున్నారట. కానీ రెమ్యూనరేషన్స్ భారీ గా ఆఫర్ చేయడం తో కాదనలేక వచ్చారు. అయితే హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా రోహిత్ తిరుగులేని డామినేషన్ చూపించాడు. ఓటింగ్ లో అతనికి దరిదాపుల్లోకి వచ్చిన వాళ్ళు లేరు.

60 నుండి 70 శాతం ఓటింగ్ తో కొనసాగాడు. ఇతని సునామీ ని చూసి వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వచ్చేందుకు కూడా సెలబ్రిటీలు ఆసక్తి చూపలేదు. గత సీజన్ లో ఏకంగా 6 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్స్ గా హౌస్ లోకి తీసుకోగా , ఈ సీజన్ లో కేవలం 4 మందిని మాత్రమే తీసుకున్నారు. నూక రాజు, రాకేష్, సీరత్ కపూర్ , పల్లవి గౌడ, ఆషిక పదుకొనే , సౌందర్య ఇలా ఎంతో మంది సెలబ్రిటీలను వైల్డ్ కార్డ్స్ కోసం అడిగారు. కానీ వాళ్ళు రోహిత్ మేనియా ని చూసి రావడానికి ఒప్పుకోలేదు. చివరికి ‘అగ్ని పరీక్ష 2’ నుండి రామకృష్ణ ని తీసుకోవాల్సి వచ్చింది. ఇంత దూరం వచ్చాక బిగ్ బాస్ టీం ఎందుకు ఊరుకుంటుంది?, ఈ సీజన్ సెలబ్రిటీ కంటెస్టెంట్ టైటిల్ విన్నర్ అవ్వకపోతే , వచ్చే సీజన్ నుండి సెలబ్రిటీలు మన షో కి రావడం కష్టం అనే ఉద్దేశ్యం తో రోహిత్ ని ఎలిమినేట్ చేసేసారు.

అంతే కాదు , వచ్చే సీజన్ నుండి ‘అగ్ని పరీక్ష’ షో కూడా ఉండదట, ఒకవేళ వాళ్లకు సామాన్యులను తీసుకోవాలని అనిపిస్తే , ఇన్ స్టాగ్రామ్ లో బాగా పాపులర్ అయిన సామాన్యులని సెలెక్ట్ చేసుకుంటారట. అలా రోహిత్ దెబ్బకు ఒక షో కూడా ఆపేయాలి అనే నిర్ణయానికి వచ్చేసారు బిగ్ బాస్ టీం. ఇకపోతే చాలా మంది రోహిత్ రీ ఎంట్రీ కోసం సోషల్ మీడియా లో యుద్దాలు చేస్తున్నారు. అంతే కాదు బయట వందల సంఖ్యలో బిగ్ బాస్ టీం పై పోలీస్ కంప్లైంట్స్ కూడా ఇచ్చారట. ఈ దీపావళి ఎపిసోడ్ కి రోహిత్ రీ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. ఈ వారం ఫ్యామిలీ వీక్ కాబట్టి , ఈ వారం కూడా రీ ఎంట్రీ ఉండే అవకాశం లేదు. మాకు వచ్చిన సమాచారం అయితే రోహిత్ రీ ఎంట్రీ ఇక ఉండదు. కాబట్టి అభిమానులు ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper