Bigg Boss 10 Telugu: మొదటి వారం లోనే ఇద్దరు కంటెస్టెంట్స్ ని , అది కూడా ఆడియన్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా ఎలిమినేషన్ చేయడం అనేది ఇప్పటి వరకు హిస్టరీ లో ఎప్పుడూ జరగలేదు. కనీసం టాస్కులు ఆడే అవకాశం కూడా ఇవ్వకుండా , కేవలం 5 రోజుల్లోనే చరణ్ , చైత్ర లను కంటెస్టెంట్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ చేయడం చాలా అన్యాయం. చాలా మంది వీళ్ళిద్దరిని సీక్రెట్ రూమ్ లో ఉంచి ఉంటారు , ఈ వీకెండ్ లో కానీ , లేదంటే వచ్చే వారం ఎదో ఒక రోజున కానీ వీళ్ళని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొస్తారని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే , నిజంగానే వీళ్లిద్దరు ఎలిమినేట్ అయ్యారని నిన్నటి ఎపిసోడ్ లో క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. అంతే కాదు , ఆ ఇద్దరితో స్పెషల్ గా వీడియో కాల్ లో కూడా మాట్లాడాడు.
ఇదంతా పక్కన పెడితే చైత్ర రాయ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందే పాపులర్ టీవీ సీరియల్ హీరోయిన్. దాదాపుగా ఆమె చేసిన ప్రతీ సీరియల్ కూడా సూపర్ హిట్ అయ్యింది. కానీ ఈమధ్య కాలం లో బాగా డౌన్ అయ్యింది , సీరియల్స్ లో అవకాశాలు తగ్గిపోయాయి. అయినప్పటికీ ఈమెకు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉండడం వల్ల రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే ఇచ్చారట మేకర్స్. ముందుగా ఆమెతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం , వారానికి 2 లక్షల 50 వేల రూపాయిలు ఇవ్వాలి అన్నమాట. అంటే రోజుకి 35 వేల 714 రూపాయిలు అన్నమాట. హౌస్ లో 5 రోజులు ఉన్నందున ఆమెకు 2 లక్షల 50 వేలు ఇచ్చారట మేకర్స్. ఒకవేళ ఈమె 10 నుండి 15 వారాలు హౌస్ లో ఉండుంటే రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ఉండేదో మీరే ఊహించుకోండి.
అయితే చైత్ర , చరణ్ లు ఈ షో నుండి పూర్తిగా అయితే ఎలిమినేట్ అవ్వలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. వచ్చే వారం లేదా మూడవ వారం లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలతో పాటు చైత్ర, చరణ్ లను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారని , ఆ తర్వాత వీళ్ళ కారణంగా ఆట ఎలాంటి మలుపు తిరుగుతుందో చూసేందుకు చాలా ఆసక్తిగా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి , వీళ్ళు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తారా లేదా అనేది.