ఎంటర్టైన్మెంట్Guntur Kaaram Pre Release Event: మహేష్ బాబు ఫ్యాన్స్ కి భారీ షాక్... ప్రీ...

Guntur Kaaram Pre Release Event: మహేష్ బాబు ఫ్యాన్స్ కి భారీ షాక్… ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు!

Guntur Kaaram Pre Release Event: మహేష్ బాబు ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశపరిచే అంశం ఇది. హైదరాబాద్ లో జరగాల్సిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ అనూహ్యంగా వాయిదా పడింది. చివరి నిమిషంలో పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఇలా జరిగింది. వివరాల్లోకి వెళితే… గుంటూరు కారం విడుదలకు మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంత వరకు చిత్ర యూనిట్ మీడియా ముందుకు రాలేదు. కేవలం సాంగ్స్ మాత్రమే విడుదల చేస్తున్నారు. కనీసం టీజర్ కూడా విడుదల చేయలేదు.

నేరుగా ట్రైలర్ విడుదల చేయాలనేది ప్లాన్. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించి అదే వేదిక మీద ట్రైలర్ లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గుంటూరు కారం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు మరొక సూచన చేశారు.

కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోండి. యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో వేడుక నిర్వహించండి అని పోలీసులు తెలియజేశారు. అయితే దానికి సంబంధించిన అనుమతులు ఇవ్వలేదు. దీంతో చేసేది లేక గుంటూరు కారం ప్రీ రిలీజ్ వేడుక వాయిదా వేశారు. ఇప్పటికే చాలా మంది అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం.

ఇప్పుడు కొత్త వేదిక నిర్ణయించాల్సి ఉంది. అదే సమయంలో ప్రీ రిలీజ్ వేడుక పూర్తిగా రద్దు చేసే అవకాశం కూడా లేకపోలేదు. మరి చూడాలి చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. గుంటూరు కారం చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Mahesh Babu Trivikram Movie: మహేష్ బాబు విషయంలో త్రివిక్రమ్ అసంతృప్తి తో ఉన్నాడా…

Mahesh Babu Trivikram Movie: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. రాజకుమారుడు సినిమా ఇచ్చిన సక్సెస్...

Venkatesh  Trivikram Srinivas Movie : వెంకటేష్,త్రివిక్రమ్ మూవీ టైటిల్ వింటే థియేటర్స్ కి క్యూలు కట్టాల్సిందే!

Venkatesh  Trivikram Srinivas Movie : టాలీవుడ్ లో ఆల్ టైం క్లాసిక్ కాంబినేషన్స్ లిస్ట్ తీస్తే అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas), విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కాంబినేషన్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది....

Most Popular

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...
Exit mobile version