Guntur Kaaram Pre Release Event: మహేష్ బాబు ఫ్యాన్స్ కి భారీ షాక్… ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు!

కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోండి. యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో వేడుక నిర్వహించండి అని పోలీసులు తెలియజేశారు. అయితే దానికి సంబంధించిన అనుమతులు ఇవ్వలేదు.

Written By: NARESH, Updated On : January 6, 2024 10:12 am

Guntur Kaaram Pre Release Event

Follow us on

Guntur Kaaram Pre Release Event: మహేష్ బాబు ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశపరిచే అంశం ఇది. హైదరాబాద్ లో జరగాల్సిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ అనూహ్యంగా వాయిదా పడింది. చివరి నిమిషంలో పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఇలా జరిగింది. వివరాల్లోకి వెళితే… గుంటూరు కారం విడుదలకు మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంత వరకు చిత్ర యూనిట్ మీడియా ముందుకు రాలేదు. కేవలం సాంగ్స్ మాత్రమే విడుదల చేస్తున్నారు. కనీసం టీజర్ కూడా విడుదల చేయలేదు.

నేరుగా ట్రైలర్ విడుదల చేయాలనేది ప్లాన్. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించి అదే వేదిక మీద ట్రైలర్ లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గుంటూరు కారం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు మరొక సూచన చేశారు.

కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోండి. యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో వేడుక నిర్వహించండి అని పోలీసులు తెలియజేశారు. అయితే దానికి సంబంధించిన అనుమతులు ఇవ్వలేదు. దీంతో చేసేది లేక గుంటూరు కారం ప్రీ రిలీజ్ వేడుక వాయిదా వేశారు. ఇప్పటికే చాలా మంది అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం.

ఇప్పుడు కొత్త వేదిక నిర్ణయించాల్సి ఉంది. అదే సమయంలో ప్రీ రిలీజ్ వేడుక పూర్తిగా రద్దు చేసే అవకాశం కూడా లేకపోలేదు. మరి చూడాలి చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. గుంటూరు కారం చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు.