Homeఎంటర్టైన్మెంట్The Paradise: నాని రేంజ్ మారిపోయిందా...నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకున్న నాని ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాతో మరోసారి మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఏది ఏమైనా కూడా నాని రేంజ్ అయితే మారిపోయిందని ప్యారడైజ్ సినిమా సక్సెస్ అయితే మాత్రం ఆయన భారీగా రెమ్యూనరేషన్ ను పెంచే అవకాశాలైతే ఉన్నాయంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఒక సినిమాకి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

ప్యారడైజ్ మూవీ హిట్ అయితే 40 నుంచి 50 కోట్ల మధ్యలో పారితోషికాన్ని తీసుకునే అవకాశం ఉందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం… ప్రస్తుతం ప్యారడైజ్ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సెప్టెంబర్ 22వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

నిజానికైతే ఆగస్టు 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లోకి రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. షూటింగ్ అనుకున్న సమయానికి కంప్లీట్ కాకపోవడం వల్లనే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశామంటూ దర్శకుడు క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేశాడు…ఇక ఏదేమైనా కూడా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ బజ్ ఉంది.

ఇప్పటికే నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో దసరా సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుంది. ప్రేక్షకులందరిలో ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Oktelugu Epaper
Exit mobile version