Guntur Kaaram: ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం కావడంతో ఈ సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉండేవి. అతడు, ఖలేజా చిత్రాలు టాలీవుడ్ హిస్టరీ లో ఆల్ టైం క్లాసిక్ గా గుర్తింపు పొందాయి. వాటికి ఇప్పటికీ కూడా టీవీ టెలికాస్ట్ లో అద్భుతమైన రేటింగ్స్ వస్తుంటాయి. అలాంటి రిపీట్ వేల్యూ సినిమాలను ఇచ్చిన కాంబినేషన్ కావడంతో ‘గుంటూరు కారం’ పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. దీంతో సినిమా బాగున్నప్పటికీ కూడా డిజాస్టర్ టాక్ ని అందుకుంది. థియేటర్స్ లో అయితే ఫ్లాప్ అయ్యింది కానీ, ఈ సినిమాకి ఓటీటీ మరియు టీవీ టెలికాస్ట్ లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యంగా ఓటీటీ లో ఈ చిత్రం టాప్ 10 లో మూడు నెలల పాటు ట్రెండ్ అయ్యింది. సూపర్ హిట్ సినిమాలు కూడా నెట్ ఫ్లిక్స్ లో అన్ని రోజులు ట్రెండ్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ ‘గుంటూరు కారం’ లాంటి థియేట్రికల్ ఫ్లాప్ సినిమా అన్ని రోజులు ట్రెండ్ అవ్వడమంటే సినిమాలో విషయం ఉండబట్టే కదా. తెలుగు వెర్షన్ నెల రోజులు ట్రెండ్ అయితే, హిందీ వెర్షన్ ఏకంగా మూడు నెలలు ట్రెండ్ అయ్యింది. ఈ చిత్రాన్ని చూసిన హిందీ ప్రేక్షకులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తూ ‘అసలు ఇంత మంచి సినిమాని తెలుగు ఆడియన్స్ ఎలా ఫ్లాప్ చేసారు..? వీళ్ళకి అసలు టేస్ట్ లేదు’ అంటూ మండిపడ్డారు. అలా ఓటీటీ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకున్న ఈ సినిమాకి టీవీ టెలికాస్ట్ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.
గత ఏడాది పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్ ‘సలార్’ చిత్రానికి స్టార్ మా టెలికాస్ట్ లో కేవలం నాలుగు టీఆర్ఫీ రేటింగ్స్ మాత్రమే రాగా, మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రానికి ఏకంగా 8 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. కేవలం మొదటి టెలికాస్ట్ లో మాత్రమే కాదు, రెండవ టెలికాస్ట్ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన హిందీ వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. త్వరలోనే టెలికాస్ట్ కి సిద్ధం అవుతుందట. ఈ టెలికాస్ట్ కి కూడా అక్కడి ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. సినిమాకి ఓటీటీ వెర్షన్ లో వచ్చిన రెస్పాన్స్ ని చూసిన విశ్లేషకులు, హిందీ వెర్షన్ ని థియేట్రికల్ రిలీజ్ చేసుంటే చాలా బాగా ఉండేదని అంటున్నారు.