Pushpa 2: గుంటూరు కారం సినిమా రికార్డ్ ను బ్రేక్ చేయబోతున్న పుష్ప 2..మ్యాటరేంటంటే..?

పుష్ప 2 నుంచి వచ్చే సాంగ్ ఈ రికార్డు ను బ్రేక్ చేస్తుంది అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే చాలామంది అభిమానులు ఈ సినిమాలోని సాంగ్స్ కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు.

Written By: Gopi, Updated On : April 27, 2024 6:15 pm

Pushpa 2

Follow us on

Pushpa 2: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2 సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక బాలీవుడ్ ప్రజలైతే ఏకంగా ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకోవడమే కాకుండా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అంటే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ గా ఒక సాంగ్ ని ఒకటోవ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చే సాంగ్ ఇంతకు ముందు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటికే గుంటూరు కారం సినిమా నుంచి వచ్చిన ‘దమ్ మసాలా’ సాంగ్ 24 గంటల వ్యవధిలోనే 17.42 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఇక అంతకుముందు ఉన్న రికార్డులను బ్రేక్ చేసి ఈ సినిమాలోని సాంగ్ సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా అత్యధికంగా ఒక రోజులో ఎక్కువ వ్యూస్ సాధించిన సాంగ్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప 2 నుంచి వచ్చే సాంగ్ ఈ రికార్డు ను బ్రేక్ చేస్తుంది అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే చాలామంది అభిమానులు ఈ సినిమాలోని సాంగ్స్ కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఎప్పుడైతే ఆ సాంగ్ వస్తుందో అది వింటూ ఆ వీడియో చూడాలి అనే ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఇక మొత్తానికైతే ఈ సినిమా నుంచి వచ్చే సాంగ్ చాలా రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో అల్లు అర్జున్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన కథలో వేసుకోబోతున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది…