ఎంటర్టైన్మెంట్Poonam Kaur: త్రివిక్రమ్ పై మరోసారి హీరోయిన్ పూనం కౌర్ షాకింగ్ కామెంట్స్...

Poonam Kaur: త్రివిక్రమ్ పై మరోసారి హీరోయిన్ పూనం కౌర్ షాకింగ్ కామెంట్స్…

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా స్టోరీ ని త్రివిక్రమ్ కాపీ చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ప్రముఖ నవల రచయిత్రి అయిన యద్దనపూడి సులోచన రాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవలను కాపీ చేశాడు అంటూ త్రివిక్రమ్ పైన ఆరోపణలు వస్తున్నాయి.

ఇక ఈ విషయం మీద ఒకప్పటి హీరోయిన్ అయిన పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదిక గా ఒక ట్వీట్ చేశారు.దాంట్లో ఆమె ఇలా రాసుకోచ్చారు “త్రివిక్రమ్ కీర్తి కిరీటాలను కాపీ చేశారు అని అంటున్నారు.ఆయన ఏదైనా చేయగలరు దాని నుంచి తప్పించుకోగలరు. ఆయన చేసిన తప్పులు ఎవరికీ కనిపించవు. గత ప్రభుత్వంలో ఈయనకి సీఎం ఆఫీస్ కి వెళ్లడానికి ప్రత్యేక యాక్సిస్ ఉండేది అలా ఎందుకు ఉండేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు” అంటూ ఆమె ట్వీట్ చేశారు.

ఇక ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది. అయితే పూనమ్ కౌర్ చాలా రోజుల నుంచి కామ్ గా ఉంటుంది కానీ ఆమెకి నచ్చినప్పుడు ఇలా నచ్చిన విధంగా ట్వీట్ చేస్తూ అందరిలో తన మీద అటెన్షన్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ కి తనకి మధ్య ఉన్న రిలేషన్ షిప్ త్రివిక్రమ్ వల్లే బ్రేక్ అయింది అనే ఉద్దేశ్యం లో తను త్రివిక్రమ్ మీద కోపంగా ఉందంటూ కొంతమంది సినీ పండితులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక అప్పటినుంచి తనకు నచ్చిన విధంగా ట్వీట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ మీద వస్తున్న కాపీ ఆరోపణలు నిజమేనా ఈ సినిమాని కూడా త్రివిక్రమ్ కాపీ చేశాడా అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మరి ఆయన కాపీ చేసాడా లేదా అనే విషయం తెలియాలంటే గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయక తప్పదు. ఇక ఇలాంటి తరుణంలోనే ఆమె చేసిన ఈ ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Trivikram And Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విషయంలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువవుతుందా…

Trivikram And Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ప్రతి సినిమా అతని ఇమేజ్ ను పెంచే విధంగానే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్...

Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే!

Seetha Payanam Collection: ఒకప్పుడు యాక్షన్ హీరో గా సౌత్ ఇండియా లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరో అర్జున్(Arjun Sarja). అందరూ ఆయన్ని యాక్షన్ కింగ్...

Most Popular

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...
Exit mobile version