https://oktelugu.com/

Anchor Rashmi: యాంకర్ రష్మీ గౌతమ్ పై రూమర్స్… దయచేసి వదిలేయండని వేడుకున్న స్టార్ యాంకర్

కెరీర్ పరంగా రష్మీ ఫుల్ బిజీ గా మారిపోయింది. ఈటీవీ లో ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు పలు స్పెషల్ ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. అడపాదడపా సినిమాల్లో మెరుస్తూ సందడి చేస్తుంది.

Written By: , Updated On : February 15, 2024 / 06:30 PM IST
Anchor Rashmi responds over rumors on guntur kaaram movie
Follow us on

Anchor Rashmi: నటిగా కెరీర్ ప్రారంభించింది రష్మీ గౌతమ్. పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. కానీ ఆమెకు అనుకున్నంత గుర్తింపు లభించలేదు. కొంతకాలం తర్వాత బుల్లితెరపై జబర్దస్త్ షో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ కామెడీ షో రష్మీకి అనతి కాలంలో గుర్తింపు తెచ్చింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో లవ్ ట్రాక్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ వేరే లెవెల్ లో ఉండేది. ఈ జంటకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర లవ్ బర్డ్స్ గా ఈ ఇద్దరు ఫేమ్ సంపాదించారు.

కెరీర్ పరంగా రష్మీ ఫుల్ బిజీ గా మారిపోయింది. ఈటీవీ లో ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు పలు స్పెషల్ ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. అడపాదడపా సినిమాల్లో మెరుస్తూ సందడి చేస్తుంది. కాగా రష్మీ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. గుంటూరు కారం మూవీ లో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత హిట్ అయిందో తెలిసిందే. అయితే ఈ పాట లో పూర్ణ తో ఓపెన్ అవుతుంది. ఈ సాంగ్ మొత్తం గ్రేస్ ఫుల్ గా డాన్స్ చేస్తూ పూర్ణ మెప్పించింది.

అయితే మొదటగా ఈ గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో రష్మిని అనుకున్నారట. ఈ మేరకు గుంటూరు కారం టీం ఆమెను సంప్రదించగా , రష్మీ చేయడానికి నిరాకరించిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ అయ్యింది. తాజాగా రష్మీ ఈ వార్తలపై స్పందించింది. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని స్పష్టం చేసింది. గుంటూరు కారం టీం నుంచి ఆమెకు ఎటువంటి ఆఫర్ రాలేదని చెప్పింది.

అంతే కాదు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దు అంటూ వేడుకుంది. దీనివల్ల ఆమె పై నెగిటివిటీ పెరిగే అవకాశం చాలా ఉందని .. ఇలాంటి చెడు ప్రచారం ఎంకరేజ్ చేస్తే తన కెరీర్ నాశనం అయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ సాంగ్ లో పూర్ణ చాలా గొప్పగా నటించిందని, ఆమెలా మరొకరు నటించలేరని రష్మీ పేర్కొంది. రష్మీ కి గతంలో మాదిరి ఆఫర్స్ రావడం లేదు.