https://oktelugu.com/

Siddu Jonnalagadda: సిద్దు చేతిలో పరాభవాన్ని మూటగట్టుకున్న మహేష్ బాబు… మ్యాటరేంటంటే..?

ఈ మూడు నెలల కాలంలో వచ్చిన సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా మహేష్ బాబు హీరోగా వచ్చిన 'గుంటూరు కారం' సినిమాని చెప్పుకోవచ్చు.

Written By:
  • Gopi
  • , Updated On : April 10, 2024 / 10:51 AM IST

    Siddu Jonnalagadda beats Mahesh Babu at US box Office

    Follow us on

    Siddu Jonnalagadda: ప్రస్తుతం యంగ్ హీరోలు మంచి కాన్సెప్ట్ లతో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా,పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఎప్పుడు మంచి సినిమాని ఆదరిస్తూ ఉంటారు. కాబట్టి మంచి సినిమా ఎవరు తీసిన సక్సెస్ లను అందుకుంటూ ముందుకెళ్తారు అనేది మాత్రం వాస్తవం…ఇక ఇప్పటికే ఈ సంవత్సరం తెలుగు సినిమాల హవా కొనసాగుతుందనే చెప్పాలి. ఇక ఈ మూడు నెలల కాలంలో వచ్చిన సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాని చెప్పుకోవచ్చు.

    అయితే ఈ సినిమా మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులు కొంతవరకు ఈ సినిమాని చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు… ఇక దీనికి తోడుగా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘హనుమాన్ ‘ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని ప్రేక్షకులందరిని ఆకర్షించింది. దాంతో ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా చిన్న సినిమాగా వచ్చి 400 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి ఒక ప్రభంజనాన్ని సృష్టించిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా వచ్చిన డీజే టిల్లు స్క్వేర్ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేస్తూ ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ 2 సినిమాగా నిలవడం విశేషం.. ఇక అమెరికా లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.

    ఇక ఇప్పటికే మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమా రికార్డ్ ను బ్రేక్ ఇస్తూ అద్భుతమైన వసూళ్లను రాబట్టడంతో ఈ సినిమా టీం లో మరింత జోష్ పెరిగింది. ఇక ఈ సంవత్సరం లో ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో అమెరికా లో ఎక్కువ వసూళ్లను రాబట్టిన సినిమాల్లో హనుమాన్ సినిమా మొదటి స్థానం లో ఉంది. ఈ సినిమా లాంగ్ రన్ లో 5.26 మిలియన్ డాలర్లను వసూలు చేయగా, గుంటూరు కారం సినిమా 2.63 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

    ఇక ఇప్పుడు డీజే టిల్లు స్క్వేర్ మూవీ 2.69 మిలియన్ డాలర్లను వసూలు చేసి హనుమాన్ సినిమా తర్వాత సెకండ్ పొజిషన్ ను సొంతం చేసుకుంది… ఇక ఈ దెబ్బతో సిద్దు జొన్నలగడ్డ లాంటి యంగ్ హీరో మహేష్ బాబు లాంటి స్టార్ హీరో రికార్డును బ్రేక్ చేసి ముందుకు సాగడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక డిజె టిల్లు స్క్వేర్ లాంగ్ రన్ లో 3 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి…