Pawan Kalyan Bheemla Nayak
Bheemla Nayak Pre Release Event: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ రోజు ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కొన్ని సూచనలు జారీ చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడడం, తొక్కిసలాటలను నివారించేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Pawan Kalyan Bheemla Nayak
ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పాసులు ఉన్నవారికి మాత్రమే లోనికి అనుమతి.
ఫిబ్రవరి 21న ఈవెంట్ కోసం ఇచ్చిన పాసులు చెల్లవు.
వ్యక్తిగత వాహనాలలో కాకుండా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా వస్తే మంచిది.
పాసులు లేనివారికి అనుమతి లేదు.
Also Read: భారీ స్కాంలో సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య.. అసలు ఆమె ఏం చేసిందో తెలుసా?
ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగే ప్రాంతానికి పాసులు లేకుండా వచ్చి గొడవ పడితే వారిపై చట్టపరమైన చర్యలు.
ఈవెంట్ కోసం వచ్చిన వారు తమ వాహనాలను నిర్దేశించిన ప్రదేశంలో పార్క్ చేయాలి.
‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ ఈవెంట్కు పోలీసుల సూచనలు
Pawan Kalyan in Bheemla Nayak
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ కూడా పూర్తి అయ్యింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితారా ఎంటర్టైన్మెంట్స్ వెల్లడించింది. ”భీమ్లా నాయక్‘ పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. కాగా ఈ సినిమాలో పవన్ కల్యాణ్ యాక్షన్ కూడా అద్భుతంగా ఉంటుందట.
Also Read: భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్లేవారికి ముఖ్య గమనిక.. ఇవి పాటించండి