Bhagyashri entry mega compound: కొంతమంది హీరోయిన్స్ కి అందం, టాలెంట్ అన్నీ ఉంటాయి, కానీ సక్సెస్ లు మాత్రం లేవు, అయినప్పటికీ అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి అదృష్టం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ లో కేవలం కొంతమందికి మాత్రమే సొంతం. ఆ కొంతమందిలో ఒకరు భాగ్యశ్రీ భొర్సే(Bhagyashree Borse). ఈమె కెరీర్ ‘మిస్టర్ బచ్చన్’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తో మొదలైంది. అమ్మాయి చూసేందుకు చాలా ముచ్చటగా ఉంది, కానీ మొదటి సినిమానే ఇంత పెద్ద ఫ్లాప్ అయ్యింది, ఇక ఈమెకు అవకాశాలు రావడం కష్టమే అని చాలా మంది విశ్లేషకులు అప్పట్లో కామెంట్స్ చేశారు. కట్ చేస్తే ఆమె వరుసగా మూడు సినిమాలకు అడ్వాన్స్ తీసుకుంది. ‘మిస్టర్ బచ్చన్’ తర్వాత ఈమె హీరోయిన్ గా నటించిన ‘కాంతా’ , ‘ఆంధ్రా కింగ్ తాలూకా’, ‘కింగ్డమ్’ వంటి చిత్రాలు ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.
‘కాంతా’ చిత్రంతో ఈమె అందంతోనే కాదు, నటన లో కూడా తోపు అని నిరూపించుకుంది. కానీ సక్సెస్ మాత్రం లేదు. అయినప్పటికీ ఈమె కెరీర్ ఆగిపోలేదు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘లెనిన్’ చిత్రం లో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం శ్రీలీల ని తీసుకున్నారు. గ్లింప్స్ వీడియోలో కూడా ఆమెని మనం చూడొచ్చు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఆ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆమె స్థానం లోకి భాగ్యశ్రీ వచ్చింది. ఈ చిత్రం తో పాటు త్వరలోనే వరుణ్ తేజ్ హీరో గా నటించబోతున్న లవ్ స్టోరీ లో కూడా ఈమె హీరోయిన్ గా నటించబోతుంది. రోబోటిక్/ AI లవ్ స్టోరీ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ‘టచ్ చేస్తే చూడు’ ఫేమ్ విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించబోతున్నాడు అట.
అదే విధంగా సాయి ధరమ్ తేజ్ త్వరలోనే ‘క’ దర్శకులతో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో కూడా భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించబోతుంది అట. ఈ హాట్ బ్యూటీ కి దక్కిన మరో బంపర్ ఆఫర్ ఏంటంటే త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతున్న పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి మూవీ లో ఈమెని హీరోయిన్ గా తీసుకునేందుకు దర్శక నిర్మాతలు పరిశీలిస్తున్నారు అట. ఇలా వరుసగా మెగా హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదించి బంపర్ ఛాన్స్ కొట్టేసింది. అన్నీ కలిసొస్తే ‘పెద్ది’ చిత్రం లో స్పెషల్ ఐటెం సాంగ్ ని కూడా ఈమెతో చేయించే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈమె కెరీర్ లో ఒక్క హిట్ పడినా ఇండస్ట్రీ లో ఒక దశాబ్దం పాటు నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
