Homeఎంటర్టైన్మెంట్Band Melam Movie Closing Collections: 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్.. క్లోజింగ్ లో...

Band Melam Movie Closing Collections: 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్.. క్లోజింగ్ లో ‘బ్యాండ్ మేళం’ చిత్రం రాబట్టిన వసూళ్లు ఇవే..

Band Melam Movie Closing Collections: గత ఏడాది ‘కోర్ట్’ ఛితంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న రోషన్ , శ్రీదేవి జంట, ఈ ఏడాది ‘బ్యాండ్ మేళం’ చిత్రం తో మన ముందుకొచ్చారు. ప్రముఖ రచయితా కోన వెంకట్ నిర్మించిన ఈ చిత్రం శ్రీ రామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందు మూవీ టీం ప్రొమోషన్స్ ని చూసి కచ్చితంగా మంచి చిత్రాన్ని అందించబోతున్నారని అంతా అనుకున్నారు . కానీ తీరా […]

Band Melam Movie Closing Collections: గత ఏడాది ‘కోర్ట్’ ఛితంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న రోషన్ , శ్రీదేవి జంట, ఈ ఏడాది ‘బ్యాండ్ మేళం’ చిత్రం తో మన ముందుకొచ్చారు. ప్రముఖ రచయితా కోన వెంకట్ నిర్మించిన ఈ చిత్రం శ్రీ రామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందు మూవీ టీం ప్రొమోషన్స్ ని చూసి కచ్చితంగా మంచి చిత్రాన్ని అందించబోతున్నారని అంతా అనుకున్నారు . కానీ తీరా చూస్తే బిలో యావరేజ్ చిత్రాన్ని అందించారు. అయినప్పటికీ ‘కోర్ట్’ చిత్రం తో ఈ జంట మంచి ఇమేజ్ ని యూత్ ఆడియన్స్ లో సంపాదించడం వల్ల, డీసెంట్ ఓపెనింగ్స్ తో పాటు డీసెంట్ లాంగ్ రన్ కూడా దక్కింది. ఓవరాల్ థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్ర నుండి 6 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. అదే విధంగా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 7 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, క్లోజింగ్ లో 3 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రాంతాల వారిగా నమోడైన గ్రాస్ వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 2 కోట్ల 54 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, సీడెడ్ ప్రాంతం నుండి 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ నుండి 2 కోట్ల 86 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఓవరాల్ గా ఈ చిత్రానికి విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 4 కోట్ల 20 లక్షల రూపాయిల వరకు ఉంటుంది. దాదాపుగా 90 శాతం రీకవరీ ని సాధించింది. ఒకవేళ పాజిటివ్ టాక్ వచ్చి ఉండుంటే ఈ చిత్రం తో కూడా మరో సారి 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ క్యూట్ జంట కొల్లగొట్టి ఉండేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. నిర్మాతగా అయితే కోన వెంకట్ సేఫ్ సైడ్ ఉన్నాడు. ప్రీ రిలీజ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే ఆయన పెట్టిన డబ్బులు వచ్చేశాయ్. థియేటర్స్ నుండి ఇక ఎంత వచ్చినా బోనస్ అని చెప్పొచ్చు . ఓవరాల్ గా బ్యాండ్ మేళం చిత్రం సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్ అనడం లో ఎలాంటి సందేహం లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper