spot_img
Homeఎంటర్టైన్మెంట్Balayya insults Kota Srinivasarao: కాండ్రించి ఉమ్మాడు.. బాలయ్యపై కోట ఘాటు వ్యాఖ్యలు

Balayya insults Kota Srinivasarao: కాండ్రించి ఉమ్మాడు.. బాలయ్యపై కోట ఘాటు వ్యాఖ్యలు

Kota Srinivasarao comments on BalayyaBalayya insults Kota Srinivasarao: సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ (Balayya) ప్రవర్తన గురించి చాలా మందికి తెలుసు. ఆయనకు కోపం ఎక్కువ. కొన్నిసార్లు కొడతారు కూడా. అలాంటి ఆయన నైజం గురించి తెలియని వారుండరు. కానీ ఆయనను సపోర్టు చేసే వారు కూడా ఉన్నారు. ఏం చేసినా బాలయ్య బంగారం అని అంటుంటారు. అయితే ఏ సమయంలో ఎలా ఉంటాడో ఆయనకే తెలియని పరిస్థితి. సినిమాల్లో ఆయన చెప్పే డైలాగులకు ఎంతటి ప్రాచుర్యం ఉంటుందో తెలిసిందే. సినిమాల్లో లాగా కాకుండా బయట మాత్రం ఆయన వైఖరి అదో రకంగా ఉంటుందని చెబుతారు.

ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు(Kota Srinivasarao) సంచలన నిజాలు వెల్లడించారు. తనకు బాలయ్యతో ఎదురైన అనుభవం గురించి చెప్పాడు. గతంలో ఎన్టీఆర్ హయాంలో మండలాదీశుడు అనే సినిమా చేశాడు కోట శ్రీనివాసరావు. అప్పట్లో అది ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా వచ్చిన సినిమా. అందులో ఎన్టీఆర్ పాత్ర కోట వేశారు. దీంతో అది బాలయ్యకు నచ్చలేదు. ఆ సినిమా విడుదలయ్యాక కోటను ఎక్కడ బయట కనిపించినా ఎన్టీఆర్ అభిమానులు టార్గెట్ చేసి కొట్టిన సందర్భాలు ఉన్నాయి.

దీంతో ఎన్టీఆర్ నే కలవాలని చాలాసార్లు ప్రయత్నించినా కుదరలేదు. కానీ ఓసారి మాత్రం బాలయ్యకు కోట ఎదురుపడ్డాడు. ఓ సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చిన్పుడు ఇద్దరు తారసపడడంతో కోట బాలయ్యకు నమస్కారం చెప్పారు. కానీ బాలయ్య మాత్రం కోట మొహంపై ఉమ్మేశాడు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని బయటపెట్టాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట సంచలన విషయాలు వెల్లడించారు

ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన కొత్తలో మండలాదీశుడు సినిమా వచ్చింది. రామారావు వేషం కోట వేయడంతో అది అప్పట్లో సంచలనం అయింది. బాలయ్య తన మొహం మీద ఉమ్మేయడమే కాదు ఇంకా అలాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. అయినా ఎన్టీఆర్ మాత్రం సినిమా బాగుందని మెచ్చుకుని భుజం తట్టారని చెప్పాడు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Banana Benefits

Banana Benefits: అరటిపండు ఈ టైంలో తినొచ్చా..ఎవరు తినకూడదు..

Banana Benefits: మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఇది రుచితో పాటు శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ వంటి పోషకాలను అందిస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల...
July 26 Zodiac Predictions

July 26 Zodiac Predictions: జూలై 26 నుంచి ఈ ఆరు రాశుల వారికి పండుగే.. ఎలాగంటే

July 26 Zodiac Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశుల స్థానాలు మారుతూ ఉంటాయి. జూలై 26 నుంచి గురు చంద్రుల మధ్య ఏర్పడనున్న రాశి పరివర్తన...
Japan Heatwave

Japan Heatwave: అధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కుతున్న జపాన్.. హ్యుమన్ ఫ్రిడ్జ్ వాడుతున్న జనం.. అసలేంటిది..

Japan Heatwave: సాధారణంగా ఆహ్లదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండే జపాన్ ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో అక్కడి...
Lenin Success

Lenin Success: లెనిన్ హిట్ తో దర్శకుడి జాతకం మతిపోయింది… స్టార్ హీరోతో మూవీ సెట్ చేసుకున్నాడుగా…

Lenin Success: అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్... మొదటి సినిమాతోనే బుక్క బోర్లపడ్డాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆ డైరెక్టర్ తో సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాడుగా…

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమ ఐడెంటిటిని కాపాడుకుంటూ స్టార్ హీరోల రేంజ్ లో ముందుకు దూసుకు వెతుకుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరు వాళ్లను వాళ్ళు...
Oktelugu Epaper