
కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపుర్రులో కరోనా కలకలం సృష్టిస్తోంది. స్థానిక ఉన్నత పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. శుక్రవారం పాఠవాలలో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇవాళ వచ్చిన ఫలితాల్లో పది మందికి పాజిటివ్ గా నిర్ధరణ అయింది. అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు పాఠశాలకు సెలవు ప్రకటించారు.