
రాష్ట్రంలోని దళిత కుటుంబాల అభివృద్ధికి ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నంది. ఇందులో భాగంగా నియోజకవర్గంలో దళితబంధు కోసం మరో రూ. 500 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హుజూరాబాద్ లో సభ అనంతరం ఫైలబ్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ. 2 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే రూ. 500 కోట్లు విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన రూ. 500 కోట్లు కలిపి రూ. వెయ్యి కోట్ల నిధులు విడుదలయ్యాయి.