Koratala Siva Balakrishna Movie Update: ‘దేవర’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ తో ‘దేవర 2’ చిత్రాన్ని చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఆయన నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని వివరాలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా ఈ చిత్రం లో బాలయ్య పోషించబోయే పాత్ర కు సంబంధించిన వివరాలను తెలుసుకొని అభిమానులు మెంటలెక్కిపోతున్నారు. ఇందులో బాలయ్య ఫస్ట్ హాఫ్ మొత్తం ఒకలాగా, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మరొకలాగా కనిపించబోతున్నాడట. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో ఆయన మాఫియా డాన్ లాగా కనిపించబోతున్నాడని టాక్. ఆయన లుక్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుంది అట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హై ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాలు కేవలం మాస్ ఆడియన్స్ ని మాత్రమే కాదు , జెన్ జీ ఆడియన్స్ ని కూడా మెంటలెక్కిపోయేలా చేస్తుందని అంటున్నారు.
అయితే బాలయ్య ఇప్పటి వరకు ఎన్నో రకాల విభిన్నమైన పాత్రలు పోషించాడు కానీ, మాఫియా డాన్ పాత్రలో మాత్రం ఇప్పటి వరకు కనిపించలేదు. కాబట్టి కొరటాల శివ బాలయ్య ని ఎలా చూపించబోతున్నాడు అనే దానిపై కేవలం నందమూరి అభిమానుల్లోనే కాదు , ఇతర హీరోల అభిమానుల్లో కూడా ఆసక్తి రేపుతోంది. ఈ ఏడాది లోనే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే గ్రాండ్ గా ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. బాలయ్య కెరీర్ లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్ చిత్రం గా నిలబడబోతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో చేయబోతున్న చిత్రం లో కూడా మాఫియా డాన్ క్యారెక్టర్ లోనే కనిపించబోతున్నాడు.
నేటి తరం ఆడియన్స్ ఇలాంటి రోల్స్ కి బ్రహ్మరథం పడుతున్న ఈ నేపథ్యం లో బాలయ్య వరుసగా రెండు సార్లు అలాంటి పాత్రలు చేయబోతుండడం నందమూరి అభిమానులకు విజువల్ ఫీస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక కొరటాల శివ తో చేయబోయే సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు , ఇతర తారాగణం ఏంటి , మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు వంటి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. కొరటాల శివ ఇలా బాలయ్య మూవీ కి షిఫ్ట్ అవ్వడంతో , ‘దేవర 2’ సినిమా ఇక లేనట్టే అని నందమూరి అభిమానులు బలంగా ఫిక్స్ అయిపోయారు.
