Homeబిజినెస్Vayve Eva solar recharge car: సోలార్టో రీఛార్జ్.. నగరాల్లో ఉండే వారికి బెస్ట్ కారు...

Vayve Eva solar recharge car: సోలార్టో రీఛార్జ్.. నగరాల్లో ఉండే వారికి బెస్ట్ కారు ఇదే..

Vayve Eva solar recharge car: ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరిగిపోతుంది. దీంతో చాలా కంపెనీలు పెట్రోల్ కార్ల స్థానంలో వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఇప్పటికే వినియోగదారులను ఆకర్షించడానికి భిన్నమైన కార్లను తీసుకువచ్చిన Tata Motors, Mahindra వంటి కంపెనీలకు దీటుగా Vayve Mobility నుంచి సరికొత్త కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో విద్యుత్ బ్యాటరీ ఉన్నప్పటికీ.. సోలార్ ప్లేట్ల ద్వారా అదనపు విద్యుత్ ను పొందవచ్చు. దీంతో విద్యుత్ ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ కారు బడ్జెట్లో అందుబాటులో ఉండడమే కాకుండా.. మైలేజ్ విషయంలో కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. నగరాల్లో ఉండే వారికి అనుకూలంగా ఉండే ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Vayve Mobility నుంచి మార్కెట్లోకి Vayve Eva అనే ఎలక్ట్రిక్ కారు ఆకర్షిస్తుంది. ఇది సాధారణ కార్ల కంటే భిన్నమైన ఆకృతిని కలిగి ఉండడంతో చాలామంది దీనిని చూసి ఆకర్షితులవుతున్నారు. అంతేకాకుండా నగరాల్లో ఉండే ప్రయాణికులు రోజువారి అవసరాల కోసం దీనిని కొనాలని చూస్తున్నారు. ఈ కారు ఎంట్రీ లెవెల్ వేరియంటు లో 9 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. ఈ బ్యాటరీ ని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 125 కిలోమీటర్ల మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే టాప్ వేరియంట్ వేగా కారులో 18 కిలో వాట్ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

ఈ కారులో స్పెషల్ ఏంటంటే దీని టాప్ పై మొత్తం సోలార్ ప్యానెల్తో అమర్చబడి ఉంటుంది. ఇది సూర్యరశ్మితో బ్యాటరీ కి అదనపు విద్యుత్ ను అందిస్తుంది. దీంతో వినియోగదారులకు విద్యుత్ ఖర్చులు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భారతదేశం లాంటి సూర్య రష్మి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ కారు ఎంతో సౌలభ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ముగ్గురు ప్రయాణికులు సులభంగా వెళ్లగలిగే ఈ కారు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంతేకాకుండా ఇందులో ప్రత్యేకమైన ఇంటీరియర్ ఫీచర్లు ఉండడంతో డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది.

Vayve Eva కారు ప్రస్తుతం మార్కెట్లో రూ.3.99 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందులో టాప్ వేరియంట్ రూ.5.99 లక్షలతో. అయితే ఈ కారుకు డిమాండ్ ఉన్న కారణంగా ప్రస్తుతం బుకింగ్స్ ను ఆపేశారు. 2026 చివరినాటికి డెలివరీ చేసిన తర్వాత తిరిగి బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper