Homeఎంటర్టైన్మెంట్బాలయ్య పైత్యం.. కొత్త హీరోయిన్ ఇక పాతదే !

బాలయ్య పైత్యం.. కొత్త హీరోయిన్ ఇక పాతదే !

ప్రపంచంలో ఇప్పుడున్న పెద్ద సమస్య కరోనానే. అయితే మిగతా రంగాలు ఎలా ఉన్నా ఈ కరోనా మహమ్మారి దెబ్బకు సినీ లోకాలు స్తంభించిపోయాయి. సినిమా పక్షులు అల్లాడిపోతున్నాయి. మళ్ళీ షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. అసలు సీరియల్ షూట్ కే నానాకష్టాలు పడాల్సి వస్తోంది. ఒకటి రెండు రోజులు షూట్ చేసినందుకే.. కొన్ని సీరియల్ యాక్టర్స్ కరోనా సోకి ఇంటికే పరిమితం అయిపోయారు. ఇప్పటికే డబ్బులు పోసిన చిత్రనిర్మాతల కన్నీళ్ళు తుడవటానికి ఎవ్వరి వల్ల సాధ్యం […]


ప్రపంచంలో ఇప్పుడున్న పెద్ద సమస్య కరోనానే. అయితే మిగతా రంగాలు ఎలా ఉన్నా ఈ కరోనా మహమ్మారి దెబ్బకు సినీ లోకాలు స్తంభించిపోయాయి. సినిమా పక్షులు అల్లాడిపోతున్నాయి. మళ్ళీ షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. అసలు సీరియల్ షూట్ కే నానాకష్టాలు పడాల్సి వస్తోంది. ఒకటి రెండు రోజులు షూట్ చేసినందుకే.. కొన్ని సీరియల్ యాక్టర్స్ కరోనా సోకి ఇంటికే పరిమితం అయిపోయారు. ఇప్పటికే డబ్బులు పోసిన చిత్రనిర్మాతల కన్నీళ్ళు తుడవటానికి ఎవ్వరి వల్ల సాధ్యం కాని సంఘటనలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినబడుతున్నాయి.

Also Read: ‘పుష్ప’లో బిగ్గెస్ట్‌ ట్విస్ట్‌ అదే!

అయితే ఇంత జరుగుతున్నా మన బాలయ్య మాత్రం కరోనా నన్ను ఏమి చెయ్యలేదు, నా పార్ట్ కి సంబందించి షూట్ పెట్టమని అంటున్నాడట. కనీసం తన పై సోలోగా వచ్చే సాంగ్ నైనా షూట్ చేద్దామని బాలయ్య తెగ తాపత్రయ పడిపోతున్నాడట. పాపం ఎవ్వరికీ ఎదురుచెప్పే దైర్యం లేదాయే. పైగా బోయపాటి ప్లాప్ లో ఉన్నాడు. తేడా కొడితే బోయపాటికి ఉన్న గౌరవం కూడా పోతుంది. అయినా చాలా మంది స్టార్ హీరోలు నిర్మాతలే ఈ సంవత్సరం చివరి వరకు అవుట్ డోర్ షెడ్యూల్స్ ను రద్దు చేసుకుంటే బాలయ్యకి అవేమిపట్టనట్టు కనబడటం లేదు. దీన్నే బాలయ్య పైత్యం అంటారేమో.

Also Read: బిగ్‌బాస్‌4 కోసం పూనమ్‌ బజ్వా అంత తీసుకుంటోందా?

కాగా స్టూడియోలో సెట్ వేసి బాలయ్య మీద సోలో సాంగ్ ను షూట్ చేస్తారేమో చూడాలి. కానీ బాలయ్య ఒక్కరి మీదే సాంగ్ ఏమి చేస్తారు. హీరోయిన్ కావాలి. కనీసం డూప్ నైనా పెట్టాలి. మరి ఇప్పుడు బాలయ్య కోసం బోయపాటి బృందం ఏమి చేస్తోందో చూడాలి. మొత్తానికి కరోనా కూడా బాలయ్యను ఎఫెక్ట్ చెయ్యలేకపోయింది. ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు. బాలయ్య సరసన హీరోయిన్ అంటే.. ఆ కొత్త హీరోయిన్ ఇక పాతది అయిపోయినట్టే.. పాపం. సక్సెస్ కొట్టకముందే ఫేడ్ అవుట్ అయ్యే ప్రమాదం ఉండటం నిజంగా దురదృష్టమే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper