spot_img
Homeఎంటర్టైన్మెంట్Trivikram Srinivas: వెనుకబడ్డ త్రివిక్రమ్... అదే ఆయనకు పెద్ద మైనస్!

Trivikram Srinivas: వెనుకబడ్డ త్రివిక్రమ్… అదే ఆయనకు పెద్ద మైనస్!

Trivikram Srinivas:  టాలీవుడ్ ని పాన్ ఇండియా మోజు ఊపేస్తోంది. బాహుబలి సక్సెస్ తర్వాత మొదలైన ఈ ట్రెండ్ పుష్ప విజయంతో మరింత పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పుష్ప విడుదలకు ముందే మన స్టార్ దర్శకులలో కొందరు పాన్ ఇండియా చిత్రాలకు సిద్ధమయ్యారు. దర్శకధీరుడు రాజమౌళి వేసిన దారిని తెలుగు సినిమాకు రహదారిగా మార్చే పనిలో ఉన్నారు. పుష్ప సక్సెస్ తో రాజమౌళి తర్వాత బాలీవుడ్ లో విజయం సాధించిన డైరెక్టర్ గా సుకుమార్ రికార్డులకు ఎక్కారు.

Trivikram Srinivas
Trivikram Srinivas

అలాగే డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ హిందీ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. ఆయన బిగ్ బి అమితాబ్ తో బుడ్డా హోగా తేరా బాప్ అనే చిత్రం చేశారు. ఇక లైగర్ మూవీతో పాన్ ఇండియా దర్శకుడిగా మారనున్నారు. కొరటాల శివ ఎన్టీఆర్ 30వ చిత్రంతో , క్రిష్ హరి హర వీరమల్లు మూవీతో… హిందీ బెల్టులో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ విషయంలో వెనుకబడ్డారనిపిస్తుంది. అరవింద సమేత, అల వైకుంఠపురంలో వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో టాప్ 3 లో ఉన్న త్రివిక్రమ్ ఈ దిశగా ఆలోచన చేయకపోవడం ఆశ్చర్యం వేస్తుంది.

Also Read: ‘కార్తి’తో రొమాన్స్ కి సమంత రెడీ !

అదే సమయంలో త్రివిక్రమ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తాయా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే త్రివిక్రమ్ మన తెలుగు నేటివిటీని ప్రతిబింబించేలా కుటుంబ కథా చిత్రాలు చేస్తారు. త్రివిక్రమ్ చిత్రాలను నిశితంగా పరిశీలిస్తే 70ల నాటి కథలకు జస్ట్ మోడ్రన్ టచ్ ఇచ్చినట్లు ఉంటాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ కి తన మార్కు మాటలు జోడించి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. కథలు చాలా సాదాసీదా ఉంటాయి. త్రివిక్రమ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన అత్తారింటికి దారేది, అల వైకుంఠపురంలో చిత్రాలు పూర్తిగా కుటుంబ కథా చిత్రాలు.

Trivikram Srinivas
Trivikram Srinivas

ఈ తరహా సబ్జక్ట్స్ పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తాయా…? మన తెలుగు నేటివిటీతో కూడిన కథలు, నేపధ్యాలూ హిందీ జనాలకు ఎక్కుతాయా? అంటే అనుమానమే. ఒక భాషలో విజయం సాధించిన చిత్రాలు మరొక భాషలో అట్టర్ ప్లాప్ అయిన సందర్భాలు అనేకం. కారణం నేటివిటీ, అలాగే నేపథ్యంలో ఉన్న తారతమ్యాలు.

పాన్ ఇండియా చిత్రాల నేపథ్యం యూనివర్సలై ఉండాలి. అన్ని భాషల, ప్రాంతాల ప్రజలకు ఎక్కే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. త్రివిక్రమ్ చిత్రాలకు ఇది పెద్ద మైనస్ కాగా, తన మార్కు కథలతో అక్కడ ఆయన విజయం సాధిస్తారా? అనేది ఒక ప్రశ్న. దీనికి సమాధానం అల వైకుంఠపురంలో చిత్రంతో దొరకవచ్చు. అల వైకుంఠపురంలో మూవీ ఫిబ్రవరి 6న హిందీ వర్షన్ థియేటర్స్ లో విడుదల అవుతుంది. దీని సక్సెస్ ఆధారంగా త్రివిక్రమ్ పాన్ ఇండియా భవిష్యత్ అంచనా వేయవచ్చు.

Also Read: ఎక్స్ గ్రేషియా వ‌ద్దు.. నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల్సిందే..

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...
Oktelugu Epaper