Uday Kiran Sister : లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ కు అప్పట్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్..ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్టార్ గా ఎదిగాడు. అయితే, ఆ తర్వాత కాలంలో డిప్రెషన్ కు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ, ఆయన నటించిన చిత్రాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో బతికే ఉన్నాడు. ఉదయ్ కిరణ్ నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘మనసంతా నువ్వే’ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఈ పిక్చర్ లో ఉదయ్ కిరణ్ చెల్లెలి పాత్రలో నటించిన శిరీష ఇప్పుడు ఏం చేస్తుందంటే..

‘మనసంతా నువ్వే’ చిత్రంలో ఉదయ్ కిరణ్ కు ఎంతటి పేరు వచ్చిందో, శిరీషకు కూడా అంతటి పేరే వచ్చింది. చెల్లి పాత్రలో చాలా చక్కగా శిరీష నటించిందని అందరూ ప్రశంసించారు. రీమాసేన్, ఉదయ్ కిరణ్ ల కెమిస్ట్రీ గురించి అప్పట్లో సినీ ప్రేక్షకులు తెగ చర్చించుకున్నారు. ఆ తర్వాత శిరీష పర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచిందన్న పలువురు విశ్లేషించారు కూడా.

Also Read: వెనుకబడ్డ త్రివిక్రమ్… అదే ఆయనకు పెద్ద మైనస్!
ఈ చిత్రం తర్వాత నటి శిరీష తెలుగు పాపులర్ చానల్ స్టార్ మాలో ‘మౌనరాగం’ సీరియల్ లో అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సీరియల్ లో నీలవేణి పాత్రను పోషిస్తోంది శిరీష. నీలవేణి పాత్రలో చక్కగా ఒదిగిపోయిందని ఈ సందర్భంగా బుల్లితెర ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇకపోతే ఈమె తొలుత మోడలింగ్ చేసినప్పటికీ తర్వాత కాలంలో వెండితెరకు నటిగా పరిచయమయింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది శిరీష.

శిరీష ‘మనసంతా నువ్వే’ చిత్రంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని ఇప్పటికీ అందరు అంటుంటారు. ఇకపోతే ఈమె ‘వర్షం, అతడే ఒక సైన్యం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, పల్లకిలో పెళ్లి కూతురు, వెంకీ, గౌరీ’ చిత్రాల్లో పాత్రలు పోషించింది. ‘పల్లకిలో పెళ్లి కూతురు’ చిత్రంలోనూ నటి శిరీషకు చక్కటి పాత్ర లభించింది. ఇలా పలు చిత్రాల్లో చక్కటి పాత్రలు పోషించిన శిరీష.. మంచి పాత్ర లభిస్తే ఇప్పుడు కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అని అన్నట్లు తెలుస్తోంది.
Also Read: నాగబాబు తన అల్లుడికి ఇచ్చిన కట్నకానుకలు ఇవే !