Homeఎంటర్టైన్మెంట్Attitude Star Chandrahas: జేడీ చక్రవర్తి ని అనవసరంగా నా ఈవెంట్ కి పిలిచి తప్పు...

Attitude Star Chandrahas: జేడీ చక్రవర్తి ని అనవసరంగా నా ఈవెంట్ కి పిలిచి తప్పు చేశాను – యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్!

Attitude Star Chandrahas: గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా యాటిట్యూడ్ స్టార్ చంద్ర హాస్(Attitude Star Chandrahass) పేరే వినిపిస్తోంది. ఆయన హీరో గా నటించిన ‘బారాబర్ ప్రేమిస్తా’ అనే చిత్రం ఫిబ్రవరి 6న విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు ఏర్పాటు చేసిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చంద్ర హాస్ పాడిన ఒక బూతు పాటపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన […]

Attitude Star Chandrahas: గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా యాటిట్యూడ్ స్టార్ చంద్ర హాస్(Attitude Star Chandrahass) పేరే వినిపిస్తోంది. ఆయన హీరో గా నటించిన ‘బారాబర్ ప్రేమిస్తా’ అనే చిత్రం ఫిబ్రవరి 6న విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు ఏర్పాటు చేసిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చంద్ర హాస్ పాడిన ఒక బూతు పాటపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ సినిమాకు గుర్తింపు లభిస్తున్న ఈ తరుణంలో, మన తెలుగు సినిమా సాహిత్యం యొక్క పరువు తీసే విధంగా చంద్ర హాస్ పాడిన ఈ పాటను ప్రతీ ఒక్కరు తప్పుబట్టారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా సీనియర్ హీరో జేడీ చక్రవర్తి విచ్చేశాడు. అంత పెద్ద సీనియర్ నటుడు, ఇలాంటి బూతు పాటలు పాడినప్పుడు మందలించాల్సింది పోయి చప్పట్లి కొడుతూ కూర్చున్నాడు.

దీనిపై జేడీ చక్రవర్తి స్పందిస్తూ, ఆ కుర్రాడు అలా పాడుతాడు అనే సమాచారం నా వద్ద లేదు, ముందే తెలిసుంటే ప్రోత్సహించేవాడిని కాదు, కొత్త కుర్రాడు ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు ఎదో ఒక విధంగా ఆడియెన్స్ కి కనెక్ట్ అవ్వాలని అనుకోవడం మంచి లక్షణమే, కానీ ఇది పద్దతి కాదు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. దీనికి కౌంటర్ గా చంద్ర హాస్ స్పందిస్తూ ‘నేను తప్పు పాడాను అని జేడీ చక్రవర్తి గారికి అనిపించినప్పుడు, ఆ ఈవెంట్ లో నాతోనే నేరుగా చెప్పి ఉండాల్సింది. బయటకు వచ్చిన తర్వాత ఆయన అలా మాట మార్చడం ఏమాత్రం కరెక్ట్ కాదు. చక్రవర్తి గారు నా తండ్రి కి ఫోన్ చేసి ఇంటర్వ్యూ కి వెళ్లే ముందు కొంచెం హార్ష్ గా మాట్లాడుతాను, మీ వాడిని ఫీల్ అవ్వొద్దని చెప్పు, ఇలా చేయడం వల్ల మీ సినిమాకు మైలేజ్ వస్తుందని కూడా చెప్పాడు. అప్పుడు ఒక లాగా మాట్లాడి, ఇప్పుడు ఇంకోలా మాట్లాడడం ఏంటో అర్థం కావడం లేదు.. ఆయన్ని అనవసరంగా ఈ ఈవెంట్ కి ఎందుకు పిలిచాను అంటూ చంద్ర హాస్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇకపోతే ఫిబ్రవరి 6 న విడుదలైన సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. అటెన్షన్ వచ్చేలా ఎదో ఒకటి చేస్తే జనాలు థియేటర్స్ కి రారు, సినిమాలో కంటెంట్ ఉంటేనే వస్తారు అని మరోసారి ఈ సినిమా ద్వారా చెప్పకనే చెప్పారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper