Homeఎంటర్టైన్మెంట్Saripodhaa Sanivaaram: 'సరిపోదా శనివారం' చిత్రంలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'..దద్దరిల్లిపోయిన థియేటర్!

Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ చిత్రంలో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’..దద్దరిల్లిపోయిన థియేటర్!

Saripodhaa Sanivaaram: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత భారీ అంచనాలతో విడుదలైన చిత్రం ‘జానీ’. ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తర్వాత, పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ మూవీ పై అప్పట్లో బాహుబలి సిరీస్ కి ఉన్నంత క్రేజ్, హైప్ ఉండేదట. ఈ చిత్రం విడుదలైన రోజు ఆంధ్ర ప్రదేశ్ యువత మొత్తం థియేటర్స్ లోనే ఉండేది అని జానీ క్రేజ్ ని కళ్లారా చూసిన వాళ్ళు చెప్తుంటారు. అయితే ఈ సినిమా అప్పటి ట్రెండ్ కి చాలా అడ్వాన్స్ గా ఉండడంతో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ లో కనీవినీ ఎరుగని రీతిలో హైప్, క్రేజ్ తో విడుదలైన చిత్రాలు జల్సా, పులి, పంజా, అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి మరియు భీమ్లా నాయక్.

ఈ సినిమాలన్నీ భారీ అంచనాలతో విడుదలైనవే కానీ, ఒక్క సినిమా కూడా జానీ క్రేజ్ ని మ్యాచ్ చేయలేకపోయాయి. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ఓజీ చిత్రం మీద జానీ కి మించిన క్రేజ్ ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ఓజీ పేరు పొరపాటున ఏ సెలబ్రిటీ నోటి నుండి అయినా వస్తే ఆడిటోరియం బద్దలయ్యే రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. ఉదాహరణకి నిన్న న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో అభిమానుల సమక్ష్యం లో విడుదల చేసారు. ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అది కాసేపు పక్కన పెడితే, ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన డీవీవీ దానయ్య పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఆయన మైక్ అందుకోగానే థియేటర్ మొత్తం ‘ఓజీ’, ‘ఓజీ’ అనే నినందాలతో దద్దరిల్లిపోయింది. ఆ క్రేజ్ ని చూసి హీరో నాని కూడా మురిసిపోయాడు. ఓజీ గురించి చెప్పమని నిర్మాతని విపరీతంగా అభిమానులు ఒత్తిడి చెయ్యగా ఆయన ‘వస్తుంది..త్వరలోనే’ అని చెప్పి తప్పించుకున్నాడు.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చి ఉంటే వచ్చే నెల 27 వ తారీఖున ఓజీ చిత్రం గ్రాండ్ గా విడుదలై ఉండేది. కానీ రాజకీయాల్లో బిజీ గా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ డేట్స్ వెంటనే కేటాయించలేకపోయాడు. దీంతో అదే తేదీన ఓజీ చిత్రానికి బదులుగా దేవర చిత్రం విడుదల అవుతుంది. సెప్టెంబర్ నెలలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి డేట్స్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రం మార్చి 28 వ తారీఖున విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఓజీ రెస్పాన్స్ వీడియో క్రింద అందిస్తున్నాము చూసి ఎంజాయ్ చెయ్యండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

US Iran Conflict

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
Oktelugu Epaper