OG: ఈ ఏడాది పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తన అభిమానులకు ‘ఓజీ’ చిత్రం ద్వారా ఇచ్చిన కిక్ మామూలుది కాదు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత పవన్ అభిమానులు పూర్తిగా సంతృప్తి చెందిన చిత్రం ఓజీ నే. మధ్యలో వచ్చిన వకీల్ సాబ్ కూడా వాళ్ళని బాగానే అలరించింది కానీ, ఓజీ ఇచ్చిన కిక్ వేరు. నిర్మాత జాప్యం కారణంగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ గా విడుదల కాలేదు, ఆ కారణం చేత 500 కోట్ల గ్రాస్ ని రాబట్టాల్సిన సినిమా, కేవలం 316 కోట్ల రూపాయలతో సరిపెట్టాల్సి వచ్చింది. అభిమానుల్లో ఈ సినిమా కారణంగా ఏదైనా అసంతృప్తి ఉందంటే, అది కేవలం పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాకు థియేట్రికల్ రీచ్ రాలేదు అనే. కానీ ఎప్పుడైతే ఓటీటీ లోకి ఈ సినిమా ఎంట్రీ ఇచ్చిందో, అప్పటి నుండి ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ చేరుతోంది.
సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి నేటికీ నెల రోజులు పూర్తి అయ్యింది. ఇప్పటికీ ఈ చిత్రం ఎన్ని కొత్త సినిమాలు విడుదలైనా టాప్ 10 లో ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 30 రోజుల్లో దాదాపుగా 9 మిలియన్ల వ్యూస్ వచ్చాయని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ చిత్రం కోటి వ్యూస్ మార్కుని కూడా అందుకోవడానికి సిద్ధంగా ఉంది. ఫుల్ రన్ లో ఇంకా ఎన్ని వారాలు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతుందో చూడాలి. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ చిత్రం కచ్చితంగా ఫుల్ రన్ లో 15 మిల్లియన్లకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.
ఒక పక్క థియేట్రికల్ పరంగా, మరో పక్క ఓటీటీ పరంగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. డైరెక్టర్ సుజీత్ కాస్త సెకండ్ హాఫ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఉండుంటే ఈ సినిమా ఇంకా వేరే లెవెల్ కి వెళ్లి ఉండేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఈ సినిమా సంగతి కాసేపు పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ నుండి తదుపరి రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతోంది.ఈ చిత్రానికి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని డిసెంబర్ 31న విడుదల చేయబోతున్నారు.