Star Directors making movies for Heroines: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు చాలా ఎక్కువ కాలం పాటు కెరియర్ ఉంటుంది. వాళ్లు ఒక సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తే చాలు ఆ తర్వాత పది ప్లాపులు వచ్చినా కూడా వాళ్లకి మార్కెట్ అయితే ఉంటుంది. అలాగే వాళ్ళతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు పోటీ పడుతుంటారు. కానీ హీరోయిన్స్ కెరియర్ అనేది అలా ఉండదు. ఒక సినిమాతో ఇండస్ట్రీ సక్సెస్ ని సాధించి ఆ తర్వాత వరుస ప్లాప్ లను అందుకున్నట్లయితే వాళ్ల కెరియర్ అనేది చాలా తక్కువ కాలంలోనే ముగిసిపోతుంది. వాళ్ళు తీసిన ప్రతి సినిమాతో సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…మహా అయితే ఒక్కో హీరోయిన్ కెరియర్ 5 నుంచి 6 సంవత్సరాల వరకు కొనసాగే అవకాశాలైతే ఉన్నాయి. కొంతమంది 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ పంథాను మార్చుకొని ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నారు.
Also Read: ప్రశాంత్ నీల్ vs శ్రీకాంత్ ఓదెల…ఇద్దరిలో పై చేయి సాధించేది ఎవరు..?
కాబట్టి వాళ్ల కెరియర్ అనేది ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీ లో కొనసాగుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది స్టార్ డైరెక్టర్లు మాత్రం హీరోయిన్స్ ని వాడుకోవడానికి వాళ్ళు సినిమాలు చేస్తున్నారంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి కొందరు డైరెక్టర్లు చేసే సినిమాల్లో మ్యాటర్ ఏమీ ఉండదు. కానీ స్టార్ హీరోయిన్స్ ని తమ సినిమాలో పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు.
దీని వల్ల వాళ్లను వాడుకుంటున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది లేదు అని చాలామంది చెబుతున్నప్పటికి కొంతమంది మాత్రం అది అనుభవించే వారికి తెలుస్తుంది చూసేవాళ్ళకి ఏం తెలుస్తుంది అంటూ కౌంటర్లు వేస్తున్నారు…
Also Read: ప్యారడైజ్ కోసం నాని అంతలా కష్టపడ్డాడా..?
ఇక ఇండస్ట్రీలో ఇదంతా ఎప్పటినుంచో ఉంది అని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీ మారిపోయిందని క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఎవరు హీరోయిన్స్ గాని, సైడ్ ఆర్టిస్ట్ లను గాని ఇబ్బంది పెట్టడం లేదంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…