spot_img
Homeఆంధ్రప్రదేశ్‌JR NTR: ఎన్టీఆర్​ చెప్తే నేను వినాలా?- కొడాలి నాని

JR NTR: ఎన్టీఆర్​ చెప్తే నేను వినాలా?- కొడాలి నాని

JR NTR: ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబును అసెంబ్లీ వేదికగా వైసీపీ అవమానించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రెస్​ మీట్​లో నందమూరి కుటుంబాన్ని వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడరంటూ.. కన్నీరు పెట్టుకున్నారు చంద్రబాబు. దీంతో విషయం హాట్​టాపిక్​ అయ్యింది. అనంతరం అగ్రహీరో నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ప్రెస్​మీట్​ పెట్టి  మా కుటుంబంలోని ఆడవాళ్లను అవమానిస్తూ ఊరుకోం ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.

Jr NTR

కాగా, ఆ తర్వాత తారక్ కూడా ఈ విషయంపై స్పందించిన విషయం తెలిసిందే. అయితే, అప్పటి నుంచి ఎన్టీఆర్​ను టార్గెట్ చేస్తూ.. పలువురు వైసీపీ నేతలు విమర్షలు గుప్పించారు. కాగా, మరోవైపు,  వైసీపీ నేత కొడాలి నానిపై స్పందిస్తూ.. ఎన్టీఆర్​ను జోడిస్తూ వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.

కొడాలి నానిని జూనియర్​ ఎన్టీఆర్​ కంట్రోల్​ చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తారక్​కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ చేబితే వినాల్సిన అవసరం తనకు లేదని.. ఒకప్పుడు సినిమాల్లో కలిసి పనిచేసిన మాట వాస్తవమైనప్పటికీ.. ఆ తర్వాత విభేదాల కారణంగా దూరమయ్యాయమని వివరించారు.

మరి ఈ విషయంపై ఎన్టీఆర్​ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్​ ఆర్​ఆర్​ఆర్​ సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఈసినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు.  వీరిద్దరి కాంబినేషన్​లో వస్తోన్న రెండో చిత్రం ఇది. గతంలో వచ్చిన జనతా గ్యారేజ్​ ఎంత హిట్​ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper