Homeఉద్యోగాలుRRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ) మరో ముఖ్యమైన అడుగు వేశాయి.4,098 ఉద్యోగాలకు షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో జూనియర్‌ ఇంజనీర్‌ (వివిధ విభాగాలు), డిపో మెటీరియల్‌ సూపరింటెండెంట్, కెమికల్‌ – మెటలర్జికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న యువతకు ఇది గొప్ప అవకాశం. ఆగస్టు 14 […]

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ) మరో ముఖ్యమైన అడుగు వేశాయి.4,098 ఉద్యోగాలకు షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో జూనియర్‌ ఇంజనీర్‌ (వివిధ విభాగాలు), డిపో మెటీరియల్‌ సూపరింటెండెంట్, కెమికల్‌ – మెటలర్జికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న యువతకు ఇది గొప్ప అవకాశం. ఆగస్టు 14 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 13 వరకు గడువు ఉంటుంది.

పోస్టులు ఇవీ..
ఈ నోటిఫికేషన్‌లో మూడు ప్రధాన విభాగాలు ఉన్నాయి. జూనియర్‌ ఇంజనీర్‌ (జేఈ) సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్, టెలికమ్యూనికేషన్‌ వంటి వివిధ విభాగాల్లో అనేక పోస్టులు ఉన్నాయి. డిపో మెటీరియల్‌ సూపరింటెండెంట్‌ (డీఎంఎస్‌) స్టోర్స్‌ విభాగంలో మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ సంబంధిత పనులు. కెమికల్‌ – మెటలర్జికల్‌ అసిస్టెంట్‌ (సీఎంఏ) రసాయనిక – మెటలర్జికల్‌ పరీక్షలు, రీసెర్చ్‌ సంబంధిత పనులు. ఈ పోస్టులు దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లు, ప్రొడక్షన్‌ యూనిట్లలో ఉన్నాయి. సివిల్‌ – మెకానికల్‌ విభాగాల్లోనే ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి.

ఇవీ అర్హతలు..
అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పోస్టు ప్రకారం సంబంధిత ఇంజనీరింగ్‌ డిప్లోమా లేదా డిగ్రీ అవసరం. సీఎంఏ పోస్టుకు సైన్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధిత అర్హతలు ఉంటాయి. పూర్తి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌లో ఇస్తారు.

ఎంపిక విధానం..
ఎంపిక పూర్తిగా మెరిట్‌ ఆధారంగా జరుగుతుంది. మొదట కంప్యూటర్‌ బేస్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్, రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్‌ సైన్స్‌ ఉంటాయి. రెండో సీబీటీ టెస్టులో టెక్నికల్‌ సబ్జెక్టులు (పోస్టు సంబంధిత ఇంజనీరింగ్‌ నాలెడ్జ్‌). చివరకు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఉంటాయి. ఇంటర్వ్యూ ఉండదు.

వేతనం, ప్రయోజనాలు
ఈ పోస్టులు 7వ వేతన సంఘం లెవల్‌–6 కిందకు వస్తాయి. ప్రారంభ బేసిక్‌ పే రూ.35,400. దీంతోపాటు డీఏ, హౌస్‌ రెంట్‌ అలవెన్స్, ట్రావెల్‌ అలవెన్స్, మెడికల్‌ సౌకర్యాలు, రైల్వే పాస్‌ వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. రైల్వే ఉద్యోగాలు జాబ్‌ సెక్యూరిటీ, కెరీర్‌ గ్రోత్, పెన్షన్‌ వంటి లాభాలను అందిస్తాయి.

దరఖాస్తు ఎలా చేయాలి?
అధికారిక వెబ్‌సైట్‌ https://indianrailways.gov.in/ లేదా rrbcdg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. వివరణాత్మక నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత లింక్‌ యాక్టివేట్‌ అవుతుంది. అభ్యర్థులు ముందుగానే అవసరమైన డాక్యుమెంట్లు (ఎడ్యుకేషన్‌ సర్టిఫికెట్లు, క్యాస్ట్‌ సర్టిఫికెట్, ఫోటో, సిగ్నేచర్‌) సిద్ధం చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు, ఉద్యోగార్థులకు బంపర్‌ అవకాశం. అర్హులైన వారు త్వరగా తయారీలో దిగి, అధికారిక వెబ్‌సైట్‌ను రెగ్యులర్‌గా చూస్తూ ఉండాలి. జాబ్‌ సెక్యూరిటీ, మంచి జీతం, దేశ సేవ అన్నీ ఒకే చోట దొరికే అరుదైన అవకాశం ఇది. అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper