Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi New Movie Heroines: వెంకటేష్ , కళ్యాణ్ రామ్ లకు హీరోయిన్స్ ని...

Anil Ravipudi New Movie Heroines: వెంకటేష్ , కళ్యాణ్ రామ్ లకు హీరోయిన్స్ ని లాక్ చేసిన అనిల్ రావిపూడి.. ఊహించని కాంబినేషన్..

Anil Ravipudi New Movie Heroines: ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి వరుస ఇండస్ట్రీ హిట్స్ తర్వాత అనిల్ రావిపూడి(Anil Ravipudi) విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) తో ఒక సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. నాలుగు సూపర్ హిట్ సినిమాలను గతం లో విక్టరీ వెంకటేష్ తీసిన అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్ తో అప్పట్లో ‘పటాస్’ అనే చిత్రం కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇదే ఆయన మొదటి చిత్రం , అప్పట్లో పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అలా తనకు జీవితాన్ని ఇచ్చిన ఇద్దరు హీరోలను పెట్టి ఒకే సినిమాలో చూపించబోతుండడం అనిల్ రావిపూడి కి దొరికిన అరుదైన అదృష్టం. అందుకే ఈ చిత్రాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. కథ విషయం లో అసలు కాంప్రమైజ్ అవ్వడం లేదు.

ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్స్ ని కూడా ఆయన ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ కి జోడీగా కీర్తి సురేష్ , అదే విధంగా కళ్యాణ్ రామ్ కి జోడీగా కృతి శెట్టి నటించబోతున్నారట. సీమ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు అనీల్ రావిపూడి ముట్టుకోని జానర్ ఇది. ఆగస్టు నెలలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతుంది. అప్పటి వరకు కథ ని సానబెట్టే పనిలో ఉంటాడట అనిల్ రావిపూడి. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ కామెడీ తో సినిమాని నిలబెట్టాడు కానీ, అనిల్ రావిపూడి కెరీర్ లో వీక్ సెకండ్ హాఫ్ ఉన్న చిత్రం ఇదే అనే విమర్శలు చాలానే వచ్చాయి. అందుకే ఈసారి కథ విషయంలో చాలా పకడ్బందీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట.

ఇది ఇలా ఉండగా వెంకటేష్ తో కీర్తి సురేష్ జోడీ కట్టడం ఇదే తొలిసారి. గతంలో పవన్ కళ్యాణ్ , కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ లో వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించాడు. ఇప్పుడు ఆయన కీర్తి సురేష్ తో కలిసి నటించడం గమనార్హం. అదే విధంగా కళ్యాణ్ రామ్ కి కూడా కృతి శెట్టి తో జోడీ కట్టడం ఇదే తొలిసారి. ఇలా ఊహకందని కాంబినేషన్ ని సెట్ చేసి అందరినీ సర్ప్రైజ్ కి గురి చేసాడు అనిల్ రావిపూడి. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ ప్రస్తుతం ఫార్మ్ లో లేరు. కృతి శెట్టి అయితే ఆమె నటించిన సినిమాలు కూడా ఈమధ్య కాలంలో విడుదల అవ్వడం లేదు. కెరీర్ లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో వీళ్లిద్దరికీ నటించే అవకాశం రావడం అనేది నిజంగా అదృష్టం అనే చెప్పాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

OnePlus N6x

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...
EPFO News

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి వాయు’గండం’!

AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత...
Jogi Ramesh daughter In Law

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...
Oktelugu Epaper