Vishnupriya: విష్ణుప్రియ ఫేస్ బుక్ ఖాతాలో అస్లీల ఫోటోలు కనిపించడం కలకలం రేపింది. పూర్తి నగ్నంగా ఉన్న ఫొటోలతో పాటు అశ్లీల ఫోటోలు దర్శనమిచ్చాయి. దీంతో ఆమె అభిమానులు భారీ షాక్ తిన్నారు. రెండు రోజులుగా విష్ణుప్రియ అధికారిక ఫేస్ బుక్ స్టేటస్ లో నగ్నంగా, అర్ధ నగ్నంగా ఉన్న ఫోటోలు కనిపించాయి. అవి బ్యాక్ ఫోజులో ఉన్నాయి. దీంతో విష్ణుప్రియ స్వయంగా తన బోల్డ్ ఫోటోలు షేర్ చేశారని కొందరు భావించారు. మరీ ఇంత వల్గర్ ఫోటోలు షేర్ చేస్తుంది ఏమిటని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక వరుసగా ఆమె ఫేస్ బుక్ స్టేటస్ లో అస్లీల ఫోటోలు పోస్ట్ అవుతున్నాయి.

దీంతో అసలు ఏం జరుగుతుంది, విష్ణుప్రియ ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం ఏమిటనే సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో విష్ణుప్రియ వివరణ ఇచ్చారు. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. నా ఫేస్ బుక్ పేజ్ లో వల్గర్ కంటెంట్ తో కూడిన ఫోటోలు కనిపిస్తున్నాయని చాలా మంది ఫోన్ చేసి చెప్పారు. నా ఫేస్ బుక్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు. గతంలో కూడా ఇలా జరిగింది. అందుకే నా అకౌంట్ రద్దు చేద్దామని అనుకున్నాను. కానీ కుదరలేదు.
కాబట్టి దయచేసి నా ఫేస్ బుక్ అకౌంట్ ని అన్ ఫాలో అవ్వండి.అలాగే రిపోర్ట్ చేయండి. నా ప్రమేయం లేకుండా జరిగినా అలాంటి ఫోటోలు అకౌంట్ లో కనిపించినందుకు నన్ను క్షమించండి… అంటూ ఆమె సందేశం పోస్ట్ చేశారు. దీంతో విష్ణుప్రియ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని స్పష్టత వచ్చింది. విష్ణుప్రియ గతంలో విపరీతమైన ఎక్స్ ఫోజ్ చేస్తూ ఫోటో షూట్స్ చేశారు. ఈ క్రమంలో ఆమె బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తున్నారేమో అని కొందరు భావించారు.

ఇక యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన విష్ణుప్రియ పోవే పోరా షోతో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు. సుడిగాలి సుధీర్ తో కలిసి ఆమె ఆ షో యాంకర్ గా వ్యవహరించారు. పోవే పోరా ఓ మోస్తరు విజయం సాధించిన నేపథ్యంలో విష్ణుప్రియకు గుర్తింపు వచ్చింది. ఈ మధ్య ఆమెకు సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇటీవల విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ నటించారు. ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది.
https://youtu.be/2z4-K6DA9Jk