Brahmanandam- Garikapati: ఆధ్యాత్మిక ప్రవచనాలు చదివే గరికపాటి నరసింహారావు ఇటీవల వార్తల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. కొన్ని రోజుల కిందట ప్రముఖ నటుడు చిరంజీవిపై హాట్ కామెంట్స్ చేయడంతో సినీ ఇండస్ట్రీ షాక్ అయింది. ఆ తరువాత నాగబాబు లాంటి కొందరు గరికపాటిపై కౌంటర్ వేయడం వివాదాస్పదంగా మారింది. అయితే కొందరు పెద్దలు కలగజేసుకొని ఈ ఇష్యూని పెద్దదిగా కాకుండా కంట్రోల్ చేశారు. అప్పటి నుంచి గరికపాటి గారూ ఎక్కడికి వెళ్లినా ఆ ప్రదేశం ఉత్కంఠగా మారుతుంది. ఆయనతో పెట్టుకోవడం దేనికని కొందరు గరికపాటితో తనని పోల్చకండి.. అంటూ సినీ ఇండస్ట్రీకి చెందిన వారు పదే పదే కోరుతున్నారు. లెటెస్టుగా ప్రముఖ నటుడు బ్రహ్మానందం ఈ రకంగానే గరికపాటిపై ఓ సంచలన కామెంట్ చేశాడు. సాధారణంగా మాట్లాడుతూనే వేయకూడని సెటైర్లు వేసి ఆశ్చర్యానికి గురిచేశాడు.

దాదాపు మూడు దశబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న బ్రహ్మానందం అన్నివర్గాల ప్రేక్షకులను నవ్వించారు. ఇప్పటికీ కొన్ని సినిమాల్లో కనిపిస్తున్నారు. అయితే అవకాశాల్లేక ఖాళీగా ఉంటున్నసమయంలో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు.ఆయన కేవలం హస్య నటుడే కాకుండా కవి అన్న విషయం చాలా మందికి తెలియదు. కొన్ని పద్యాలు, వచనాలు కంఠబట్టిన వ్యక్తి. అయితే వృద్ధాప్యం వచ్చిందని చెబుతూ.. ఏ కార్యక్రమానికి వెళ్లినా ఎక్కువ టైం తీసుకోకుండా నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోతున్నాడు.
లేటెస్టుగా ఓ ప్రొగ్రాంకు అటెండ్ అయ్యారు బ్రహ్మానందం. ఇక్కడికి గరికపాటి నరసింహారావు కూడా వచ్చారు. పద్యాలు, వచనాలు గురించి వివరించిన బ్రహ్మి.. గరికపాటి గురించి కూడా మాట్లాడారు. ‘కొందరు నా గురించి ఏదో ఎక్కువ చేస్తున్నారు. నన్ను గరికపాటితో పోలుస్తున్నారు.. నేనేదో సినిమాల్లో నాలుగు వేషాలు వేసుకునే నటుడిని. అలాంటి నన్ను ఆధ్యాత్మిక భావాలను వడబోసిన గరికపాటితో పోడ్చడమేంటి..?’ అని అన్నారు. అలాగే ‘ఆధ్యాత్మిక వచనాలకు ప్యాంట్ షర్ట్ వేస్తే.. ఎవరంటే గరికపాటి అనుకోవచ్చు’ అని అన్నారు.

కొన్ని రోజుల కిందట ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు గరికపాటి హజరయ్యారు. చిరు ఫొటో షేషన్లో ఉండగా గరికపాటి హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ సినీ ఇండస్ట్రీని కాకరేపాయి. ఆ సమయంలో సినిమావాళ్లు వర్సెస్ ఆధ్యాత్మిక గురువులు అన్న రేంజ్ లో వివాదం సాగింది. కానీ ఇప్పుడు మరోసారి సినీ నటుడు బ్రహ్మానందంతో పాటు గరికపాటి హాజరయ్యారు. ఇక్కడ ఎలాంటి వివాదం మొదలైద్దో.. అని అందరూ అనుకున్నారు.
వివాదమేమి జరగకపోయినా బ్రహ్మనందం చేసిన కామెంట్స్ మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని కొందరు అంటున్నారు. బ్రహ్మానందం కంటే గరికపాటే గొప్పనా..? అని సినీ ఇండస్ట్రీకి చెందిన వారంటుండగా.. గరికపాటి ముందు ఎవరైనా తక్కువే అని ఆయన అభిమానులు రిప్లై ఇస్తున్నారు. మిగతావారు మాత్రం బ్రహ్మానందం కూల్ గా మాట్లాడినా గరికపాటిపై సెటైర్లు వేశారని అంటున్నారు. మరి ఈ విషయం ఎంత పెద్దదిగా మారుతుందో చూడాలి.
https://youtu.be/2z4-K6DA9Jk