Anasuya: జబర్దస్త్ కామెడీ షో తో యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ అనసూయ నిత్యం సోషల్ మీడియాలో తన డ్రెస్సింగ్ పై వైరల్ అవుతుంటుంది. ఈ అమ్మడు ప్రస్తుతం ఉన్నా యాంకర్ లో సినిమాల్లో, హోస్ట్ యాంకర్, వెబ్ సిరీస్ అంటూ బిజీ అయింది ఈ భామ. రంగస్థలంలో రామ్ చరణ్ కి రంగమ్మత్త గా తన పాత్రను మెప్పించి సినిమా అవకాశాలను అందుకుంటుంది అనసూయ.
డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ” పుష్ప ” ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన నటిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ” పుష్ప ” మూవీ నుండి విడుదలైన అనసూయ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో దాక్షాయణి పాత్రలో నటిస్తున్నారు అనసూయ.
ఈ సందర్భంగా ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో లైవ్ లో ముచ్చటించారు. యాంకర్ అనసూయకు ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందించారు. అనసూయ ఆ అభిమాని ఏదైనా పెద్ద ప్రాజెక్ట్‌లో మంచి పాత్ర దొరికితే గుండు కొట్టించుకోవడానికి సిద్ధమేనా అని అడిగాడు. దానికి బదులిస్తూ అనసూయ “తప్పకుండా.. ఆ పాత్రకు అవసరమైతే.. చేస్తాను” అంటూ సమాధానం చెప్పింది. సాధారణంగా ఇటువంటి పాత్రలను కాస్త క్రేజ్ ఉన్న వారు ఒప్పుకోరు అయినా అనసూయ అటువంటి పాత్రలో నటిస్తాను అనడం విశేషం. తాజాగా ఈరోజు పుష్ప సినిమా నుంచి విడుదలైన ఆమె పోస్టర్ కు మిశ్రమ స్పందన లభిస్తుంది.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More