తండ్రి కలని సాకారం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్: బిగ్ బాస్ గేమ్ షో లో పాల్గొనడమే ఒక కల. అలా బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో లో ఎందరో కంటెస్టెంట్లు పాల్గొని తమ కలలని సాకారం చేసుకుంటున్నారు. కానీ ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ మాత్రం తన కన్న తండ్రి కలని సాకారం చేసాడు.
అఖిల్ సార్థక్… బిగ్ బాస్ 4 తెలుగు రన్నర్ గా నిలిచి మంచి పేరు క్రేజ్ సంపాదించుకున్నాడు. మోనాల్ గజ్జర్ తో ప్రేమాయణం నడిపి, సోహెల్ తో స్నేహ బంధం నడిపి, ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతూ మంచి పేరు సంపాదించుకున్న అఖిల్ ని బిగ్ బాస్ లో ప్రత్యేక స్థానం లో నిలబెట్టాయి.అయితే బిగ్ బాస్ రన్నర్ గా నిలిచిన అఖిల్ సార్థక్ సొంత కారు కొనాలని అనుకున్నాడు. అలాగే సొంత కారు కొనుక్కుని తన కలని సాకారం చేసుకున్నాడు.
తండ్రి కల సాకారం: తన కల నెరవేర్చుకోవడమే కాకుండా తన తండ్రి కలని కూడా నెరవేర్చినట్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. అఖిల్ సార్థక్ తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా కారు కొన్నిచ్చి ఆనంద పరిచాడు. “హ్యాపీ బర్త్‌డే డాడ్, ఒక రక్షకుడిలా ఎప్పుడూ నా వెంటే ఉన్నావు. మీరే నా సూపర్ హీరో, మీ వల్లే నేనీ స్థానంలో ఉన్నాను. మీరు నమ్ముతారో లేదో కానీ మీ కోసం ఓ కారు కొన్నాను. చిన్నప్పుడు మీరు నాకు సైకిల్ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చారు, నాకోసం మరెన్నో చేశావు. ఇందుకు మీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. నా నుంచి మీకు చిన్న గిఫ్ట్ పప్పా.. మీరు చేసినవన్నీ నేను మీకు తిరిగి చేయలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా కృషి చేస్తాను. మీరు గర్వపడే పనులు చేస్తాను. మీకు కారు గిఫ్ట్ ఇవ్వాలన్నది నా కల. అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సర్‌ప్రైజ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా! మిమ్మల్ని ఎప్పుడూ తలెత్తుకుని తిరిగేలా చేస్తానని మాటిస్తున్నాను” అంటూ భావోద్వేగానికి గురయ్యాడు అఖిల్.