Allu Arjun Huge Lossed: మన టాలీవుడ్ లో మోస్ట్ క్రియేటివ్ జీనియస్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్..ప్రతీసారి వైవిధ్యమైన కథాంశం తో తెరకెక్కించి టాలీవుడ్ లో కొత్త స్టాండర్డ్స్ ని సెట్ చేసే సుకుమార్ గత ఏడాది అల్లు అర్జున్ తో పుష్ప అనే సినిమా ద్వారా ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..రాజమౌళి సినిమాలు కాకుండా ఇతర ప్రాంతీయ బాషలలో దుమ్ములేపే వసూళ్లను రాబట్టిన ఏకైక తెలుగు సినిమా పుష్పానే..ముఖ్యంగా హిందీ లో అయితే అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి 100 కోట్ల రూపాయిలు కొల్లగొట్టి అక్కడి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది..బాహుబలి మరియు సాహూ సినిమాలు కాకుండా బాలీవుడ్ ని అప్పట్లో షాక్ గురి అయ్యే రేంజ్ వసూళ్లు రాబట్టిన చిత్రం KGF చాప్టర్ 1..ఈ సినిమా అప్పట్లో 43 కోట్ల రూపాయిలు వసూలు చేస్తేనే ‘అబ్బో..పర్లేదు’ అని అనుకున్నారు..కానీ పుష్ప మాత్రం 3 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లతో ప్రారంభం అయ్యి ఏకంగా 100 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టడం అంటే మాములు విషయం కాదు..ఇప్పుడు KGF చాప్టర్ 2 ఇండియా లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ కి పైగా వసూలు చెయ్యడానికి కారణం KGF చాప్టర్ 1 ..ఇక ఈ లెక్కన పుష్ప పార్ట్ 2 వసూళ్లు ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.

ఊహించిన దానికంటే పుష్ప పార్ట్ 2 పై అంచనాలు అమాంతం పెరిగిపోవడం తో..పుష్ప 2 స్క్రిప్ట్ ని ప్రతి ఒక్కరికి చేరువ అయ్యేలా చెక్కుతూనే ఉన్నాడు అట సుకుమార్..సాధారణంగా సుకుమార్ సినిమాల షూటింగ్స్ బాగా ఆలస్యం అవుతూ ఉంటాయి..కానీ ఈసారి స్క్రిప్ట్ ని పకడ్బందీగా తయారు చేసేందుకే ఇంత సమయం తీసుకుంటే..ఇక షూటింగ్ పూర్తి చెయ్యడానికి ఎంత సమయం తీసుకుంటాడో అని అభిమానులు కంగారు పడుతున్నారు..వాస్తవానికి ఈ సినిమా స్క్రిప్ట్ ని ఫిబ్రవరి నెలలోనే పూర్తి చెయ్యాలి..ఇక ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా పూర్తి చేసి రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ లేదా మే నెలలో జరుపుకోవాలి..ఆరు నెలల్లో సినిమాని పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో సినిమా ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలి..కానీ ఇప్పటికి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కాలేదు..ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లేందుకు కనీసం ఏడాది సమయం పడుతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 కోసం తన మేక్ ఓవర్ ని మార్చకుండా అలానే మైంటైన్ చేస్తున్నాడు..ఈ గాప్ లో మరో సినిమాకి కూడా ఆయన ఇప్పటి వరుకు సంతకం పెట్టలేదు..అన్ని అనుకున్న సమయం లో జరిగి ఉంటే అల్లు అర్జున్ ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంత స్కోప్ ఉంది అని..మా హీరో డేట్స్ అన్నిటిని సుకుమార్ వేస్ట్ చేస్తున్నాడు అని అల్లు అర్జున్ అభిమానులు వాపోతున్నారు.

Also Read: 18 Pages Release Date: స్పీడ్ పెంచిన నిఖిల్… 18 పేజెస్ రిలీజ్ డేట్ ఫిక్స్?
Recommended Videos