Homeఎంటర్టైన్మెంట్మహేష్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ ఫిక్స్ !

మహేష్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ ఫిక్స్ !

‘మహర్షి’ అంటూ సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వంశీ పైడిపల్లికి మొత్తానికి స్టార్ హీరోతో సినిమా ఫైనల్ అయిందని వార్తలు వస్తున్నాయి. వంశీ అల్లు అర్జున్ ను కథతో ఒప్పించాడు. నిజానికి అల్లు అర్జున్ కూడా వంశీతో సినిమాకి ఇంట్రస్ట్ గా ఉన్నాడని గతంలోనే వార్తలు వచ్చినా, ఆ తరువాత ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ న్యూస్ వైరల్ అవుతుంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వంశీ […]

Allu Arjun

‘మహర్షి’ అంటూ సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వంశీ పైడిపల్లికి మొత్తానికి స్టార్ హీరోతో సినిమా ఫైనల్ అయిందని వార్తలు వస్తున్నాయి. వంశీ అల్లు అర్జున్ ను కథతో ఒప్పించాడు. నిజానికి అల్లు అర్జున్ కూడా వంశీతో సినిమాకి ఇంట్రస్ట్ గా ఉన్నాడని గతంలోనే వార్తలు వచ్చినా, ఆ తరువాత ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ న్యూస్ వైరల్ అవుతుంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి, అల్లు అర్జున్ కి ఫుల్ స్క్రిప్ట్ వినిపించాడని.. బన్నీ కూడా కథ విని బాగుందని అన్నాడని.. అక్టోబర్ లో దసరా స్పెషల్ గా ఈ సినిమాని మొదలుపెట్టనున్నారని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

అన్నట్లు వంశీ త్వరలోనే అల్లు అరవింద్ ను కూడా కలిసి కథ చెప్పనున్నాడు. అరవింద్ కి ఎలాగూ కథ నచ్చుతుందనే నమ్మకం ఉంది కాబట్టి.. వచ్చే దసరాకి బన్నీ కొత్త సినిమా ఓపెనింగ్ షురూ అయినట్టే అనుకోవాలి. మొత్తానికి మహేష్ కథ బాగాలేదు అన్నా.. వంశీ మాత్రం తాను రాసుకున్న స్క్రిప్ట్ ను మాత్రం బాగా నమ్మాడు. ఆ నమ్మకమే అల్లు అర్జున్ ను నమ్మేలా చేసింది. ఇక ఈ సినిమా పూర్తిస్థాయి ఎమోషనల్ యాక్షన్ చిత్రంగా ఉండబోతోందట. అంటే కేజీఎఫ్ మూవీలా క్రేజీ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ లో ఈ సినిమా ఉంటుందట.

మొత్తం మీద అల్లు అర్జున్ కి ఇది పాన్ ఇండియా సినిమా అవుతుందని.. అందుకే వంశీ పైడిపల్లికి బడ్జెట్ కూడా భారీగా ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. నిజానికి మహర్షి లాంటి ఓ రేంజ్ హిట్ వచ్చాక… డైరెక్టర్ గా వంశీకి ఫుల్ డిమాండ్ ఉండాలి. కానీ, అందుకు పూర్తి విరుద్ధంగా వంశీకి ఏ హీరో డేట్స్ ఇవ్వలేదు. మొదట వంశీ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే మళ్లీ చేయాలనుకున్నాడు. అయితే వంశీ చెప్పిన కథ మహేష్ బాబుకు నచ్చకపోవడంతో ఆ రకంగా వంశీతో ప్రాజెక్ట్ ను మహేష్ పక్కన పెట్టేశాడు. దాంతో వంశీ బన్నీతో ముందుకు వెళ్తున్నాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper