అనసూయ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సెలెక్టివ్ గా సినిమాల్లోను నటిస్తూ వెండితెర మీద కూడా అదరగొడుతోంది. క్షణం, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది ఈ హాట్ యాంకర్. ఇద్దరు పిల్లల తల్లయినా కూడా ఆమె హీరోయిన్స్ తో పోటీపడేంత వంపు సొంపులతో యువతకి పిచిక్కిస్తుంది. ఆ క్రేజ్ తెలుసు కాబట్టే దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాలలో ఐటెం సాంగ్స్ లో నటింపజేసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సంప్రదించగా ఇప్పుడే ఐటమ్ సాంగ్స్ చేయనంటూ తిరస్కరించటం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకే మనసు మార్చుకుని సాయి ధరమ్ తేజ ‘విన్నర్’లో ‘సుయా సుయా అనసూయ’ పాటకు, నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’ మూవీలో ఒక పాటకు, ‘ఎఫ్-2’లో ‘డింగు డాంగ్’ పాటలకు కాలు కదిపింది. ఈ అమ్మడు తాజాగా ‘చావు కబురు చల్ల’గా చిత్రంలోనూ ఐటెంసాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ కి అనసూయ తీసుకుంటున్న పారితోషకం గురించి తెలిస్తే అవాక్కవటం ఖాయం.
RX 100 హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా రూపొందుతున్న ఈ సినిమాకు కౌశిక్ దర్శకత్వం వహిస్తుండగా,అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కేవలం 3 నిమిషాల నిడివి గల ఐటెం సాంగ్ కు అనసూయ 20 లక్షలు డిమాండ్ చేయగా మేకర్స్ సరే అన్నారని సమాచారం. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్ షూట్‌ను త్వరలోనే హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనసూయ, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘థ్యాంక్ యూ బ్రదర్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Anasuya remuneration for item song
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com