Homeఎంటర్టైన్మెంట్Peddi Movie: చేతులారా 'పెద్ది' థియేట్రికల్ రన్ ని నాశనం చేస్తున్న నిర్మాతలు.. ఇలా చేస్తే...

Peddi Movie: చేతులారా ‘పెద్ది’ థియేట్రికల్ రన్ ని నాశనం చేస్తున్న నిర్మాతలు.. ఇలా చేస్తే థియేటర్స్ కి ఎవరొస్తారు?

Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ చిత్రానికి నేడు కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ నమోదు అయ్యాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి నేడు కూడా గంటకు 3 వేలకు పైగా టిక్కెట్స్ అమ్ముడుపోయాయి. ఈ రేంజ్ థియేట్రికల్ రన్ గత దశాబ్ద కాలం లో ఏ స్టార్ హీరోకి కూడా లేదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సీడెడ్, నెల్లూరు మినహా, అన్నిట్లోనూ బ్రేక్ ఈవెన్ మార్కుని సంపాదించింది. ఓవర్సీస్ , నార్త్ ఇండియా మినహా, ఈ వీకెండ్ కి మిగిలిన ప్రాంతాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వుధి అనే బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్.

ఇలాంటి బ్లాక్ బస్టర్ రన్ ఉన్నప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ ని మరింత పెంచే కార్యక్రమాలు చెయ్యాలి కానీ , నిర్మాతలు మాత్రం తగ్గించే పనులు చేస్తున్నారు. ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో పాటలు కూడా ఒకటి. ముఖ్యంగా చికిరి చికిరి , రయ్ రయ్ రారా పాటలు సెన్సేషనల్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. కేవలం ఈ పాటలను థియేటర్స్ లో చూసేందుకు జనాలు రిపీట్ గా థియేటర్స్ కి వెళ్తుంటారు. ఇప్పుడు మేకర్స్ ఈ రెండు పాటలను HD క్వాలిటీ తో యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. సినిమా థియేట్రికల్ రన్ కి ఎంత ఉపయోగపడుతున్న ఈ రెండు పాటలను ఇలా ఆన్లైన్ లోకి వదిలేస్తే , రేపు ఈ చిత్రాన్ని చూసే రిపీట్ ఆడియన్స్ ఎలా వస్తారు?, మేకర్స్ ఇంత తెలివి తక్కువ పని చేస్తారని అసలు అనుకోలేదు అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఇదంతా పక్కన పెడితే మొన్న జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ బుచ్చి బాబు ఈ బుధవారం నుండి సరికొత్త సన్నివేశాలను సినిమాలో జత చేయబోతున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఈ అప్డేట్ పై మరోసారి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిని బట్టీ చూస్తుంటే రేపు కొత్త సన్నివేశాలు ఉంటాయా లేదా అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. ఒకవేళ ఆ కొత్త సన్నివేశాలు జత చేస్తే , ఈ రెండు పాటలు సోషల్ మీడియా లో విడుదల చేసినప్పటికి కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం చూపించదు , ఇంకా పెరుగుతాయి కూడా , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
[td_block_15 category_id="_related_tag" custom_title="Related News" ajax_pagination="next_prev" limit="3"]