Homeఎంటర్టైన్మెంట్Akira Nandan: నీల్, సందీప్ వంగ తో అనుకున్నారు..కానీ చివరికి ఆ సాఫ్ట్ డైరెక్టర్ తో...

Akira Nandan: నీల్, సందీప్ వంగ తో అనుకున్నారు..కానీ చివరికి ఆ సాఫ్ట్ డైరెక్టర్ తో అకిరా నందన్ మొదటి సినిమా ఫిక్స్!

Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) కొడుకు అకిరా నందన్(Akira Nandan) సినిమాల్లోకి వస్తాడా లేదా అనే సందేహాలు అభిమానుల్లో ఉండేవి. ఎందుకంటే అతని తల్లి రేణు దేశాయ్ అనేకసార్లు ఇంటర్వ్యూస్ లో క్లారిటీ ఇస్తూ ‘అకిరా కి మ్యూజిక్ అంటే ఇష్టం, నటనపై ఆసక్తి లేదు, అతను ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇవ్వాలని ప్రతీ రోజు కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా అభిమానులను రేణు దేశాయ్ […]

Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) కొడుకు అకిరా నందన్(Akira Nandan) సినిమాల్లోకి వస్తాడా లేదా అనే సందేహాలు అభిమానుల్లో ఉండేవి. ఎందుకంటే అతని తల్లి రేణు దేశాయ్ అనేకసార్లు ఇంటర్వ్యూస్ లో క్లారిటీ ఇస్తూ ‘అకిరా కి మ్యూజిక్ అంటే ఇష్టం, నటనపై ఆసక్తి లేదు, అతను ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇవ్వాలని ప్రతీ రోజు కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా అభిమానులను రేణు దేశాయ్ కావాలని సర్ప్రైజ్ కోసం ఫ్యాన్స్ కి ఇలా చెప్తుంది, అకిరా నందన్ కచ్చితంగా ఇండస్ట్రీ లోకి అడుగుపెడతాడు అని అభిమానులు అనుకుంటున్నారు. వాళ్ళు కోరుకున్నట్టే అకిరా నందన్ గ్రాండ్ ఎంట్రీ కోసం ఏర్పాట్లు చాల్ సైలెంట్ గా సాగుతున్నాయి. ఒకపక్క అకిరా నందన్ యాక్టింగ్ స్కూల్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాడు.

మార్షల్ ఆర్ట్స్ ఇప్పటికే నేర్చుకొని ఉన్నాడు, ఇక గ్రాండ్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టడం ఒక్కటే బ్యాలన్స్. అయితే అకిరా నందన్ మొదటి సినిమా కచ్చితంగా ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ లాంటి భారీ పాన్ ఇండియన్ డైరెక్టర్స్ తో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అకిరా ఎంట్రీ చాలా సింపుల్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ఉండబోతుందని లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. రీసెంట్ గానే ఒక బడా నిర్మాత శేఖర్ కమ్ముల ని కలిసి, అకిరా నందన్ కోసం నీ దగ్గర ఏదైనా బలమైన కథ ఉందా అని అడిగారట. అంటే కచ్చితంగా అకిరా మొదటి సినిమా చాలా సింపుల్ గా ఇలా శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ఉండబోతుంది అన్నమాట. కానీ శేఖర్ కమ్ముల కి కూడా ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్, బ్రాండ్ ఇమేజ్ ఉంది.

అర్బన్ సెంటర్స్ లో, ఓవర్సీస్ మార్కెట్స్ లో శేఖర్ కమ్ముల కి పాన్ ఇండియన్ డైరెక్టర్స్ తో సమానమైన క్రేజ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి డైరెక్టర్ తో అకిరా నందన్ మొదటి సినిమా చేసి, పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంటే మాత్రం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఆకాశమే హద్దు అనే రేంజ్ లో క్రియేట్ అవుతాయి. మరి ఇది ఎంత వరకు నిజం అవ్వబోతుందో చూడాలి. గతంలో శేఖర్ కమ్ముల ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ ‘లీడర్’ అనే చిత్రం తీసాడు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించడమే కాదు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాంటి పాత్ బ్రేకింగ్ సబ్జెక్టు తో శేఖర్ కమ్ముల ఒకవేళ అకిరా తో చేస్తే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper