Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Agnipariskha 2: ఆడపిల్ల పై నోరు జారిన అమన్.. ఓవర్ యాక్షన్ చేసిన...

Bigg Boss Agnipariskha 2: ఆడపిల్ల పై నోరు జారిన అమన్.. ఓవర్ యాక్షన్ చేసిన చరణ్.. ‘అగ్ని పరీక్ష 2’ లో కొట్లాటలు..

Bigg Boss Agnipariskha 2: రీసెంట్ గా మొదలైన ‘అగ్ని పరీక్ష 2’ మంచి ఊపు మీద ముందుకు దూసుకెళ్తోంది. ఎక్కడ చూసినా ఈ షో గురించే చర్చ. మొదటి సీజన్ తో పోలిస్తే రెండవ సీజన్ రెండింతలు పెద్ద బ్లాక్ బస్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ షోలో జరిగే టాస్కులను కంటెస్టెంట్స్ ఆడే తీరు ఆ రేంజ్ లో ఉంది మరీ. ప్రతీ ఒక్కరు ప్రాణం పెట్టి ఆడేస్తున్నారు. ఈ షో […]

Bigg Boss Agnipariskha 2: రీసెంట్ గా మొదలైన ‘అగ్ని పరీక్ష 2’ మంచి ఊపు మీద ముందుకు దూసుకెళ్తోంది. ఎక్కడ చూసినా ఈ షో గురించే చర్చ. మొదటి సీజన్ తో పోలిస్తే రెండవ సీజన్ రెండింతలు పెద్ద బ్లాక్ బస్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ షోలో జరిగే టాస్కులను కంటెస్టెంట్స్ ఆడే తీరు ఆ రేంజ్ లో ఉంది మరీ. ప్రతీ ఒక్కరు ప్రాణం పెట్టి ఆడేస్తున్నారు. ఈ షో లేకపోతే మాకు జీవితం లేదు అనే రేంజ్ లో మాట్లాడుతున్నారు. అయితే నేటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ముఖ్యంగా అమన్ మసూద్ తన తోటి కంటెస్టెంట్ అపూర్వ పై నోరు జారడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా చరణ్ కి ఇది పెద్ద నెగెటివ్ ఎపిసోడ్ అనడం లో ఎలాంటి సందేహం లేదు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే మ్యూజికల్ చైర్స్ టాస్క్ లో అమన్ తనకు అన్యాయం జరుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతీ టాస్క్ లో ప్రాణం పెట్టి ఆడుతున్నాను , కానీ చివర్లో నాకే బొక్క పడుతుంది అంటూ చెప్పుకొస్తాడు అమన్. అప్పుడు మధ్యలో అపూర్వ కలగచేసుకుంటుంది. ఆమె సంచాలక్ గా ఉన్నప్పుడు తన అన్యాయం చేసిందని, కష్టపడి దెబ్బలు తాకించుకున్నది కూడా ఆమె గమనించలేదు. ఇప్పుడు కూడా తనకు సంబంధం లేకపోయినా మధ్యలో దూరి నాపై నిందలు వేస్తుంది అంటూ చెప్పుకొస్తాడు అమన్. అపూర్వ వివరణ ఇస్తున్న సమయం లో నోరు మూసుకో అని ఆమెపై గట్టిగా అరుస్తూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇక్కడ అపూర్వ సహనం కోల్పోకుండా , తన పాయింట్ ని ముందు పెడుతూ మాట్లాడిన విధానం అందరికీ నచ్చింది. అమన్ అలా మాట్లాడి ఉండకూడదు అనే భావన ప్రతీ ఒక్కరిలోనూ కలిగింది.

అంతే కాకుండా అమన్ ప్రతీ ఒక్కటి తన పీఆర్ టీం చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నట్టు ఎందుకో నిన్నటి ఎపిసోడ్ చూస్తే అనిపిస్తోంది. ఈమె సంచాలక్ గా తప్పుడు నిర్ణయం తీసుకోవడం, జడ్జీలు తనకు అనుకూలంగా నిర్ణయం తెలపడం వల్ల, బయట నా గురించి తప్పుగా అనుకుంటున్నారు , జడ్జీలు నాకు అనుకూలంగా ఇచ్చారంటూ జనాలు తప్పుగా అర్థం చేసుకొని ట్రోల్స్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. వాస్తవానికి ఈ ఎపిసోడ్ షూట్ జరిగి చాలా రోజులైంది , టెలికాస్ట్ ఈరోజు జరిగింది, మరి అమన్ ముందుగా ఎలా ఇలాంటివి కామెంట్స్ చేసాడు?, ఇది కచ్చితంగా పీఆర్ టీం చెప్పిందే అక్కడ చెప్పాడు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక చరణ్ విషయానికి వస్తే , ఆట తక్కువ , మాటలు ఎక్కువ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. మితిలేష్ మ్యూజికల్ చైర్స్ లో గెలిచిన తర్వాత జడ్జీలు నీకు బలహీనంగా ఎవరు అనిపిస్తున్నారని అడగ్గా, చరణ్ పేరు చెప్తాడు మితిలేష్. అప్పుడు చరణ్ నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే , నీకు బుద్ది లేదు అని కామెంట్ చేసాడు. ఇంత యాటిట్యూడ్ అవసరమా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by (@amanmasud_actor)

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper