Homeఅంతర్జాతీయంUganda Corruption: డ్రైనేజీ కాల్వకు మూడు లక్షల 50 వేల డాలర్లా.. పైగా మంత్రి ఫీల్డ్...

Uganda Corruption: డ్రైనేజీ కాల్వకు మూడు లక్షల 50 వేల డాలర్లా.. పైగా మంత్రి ఫీల్డ్ విసిట్..మీ అవినీతికి ఓ దండం రా అయ్యా..

Uganda Corruption: మామూలుగా మన ఏరియాలలో డ్రైనేజీ కాలువలను ఎవరు నిర్మిస్తారు.. కాంట్రాక్టర్లు.. వాటిని ఎవరి పర్యవేక్షిస్తారు.. అధికారులు.. కొన్ని సందర్భాలలో సర్పంచ్లు.. వార్డు మెంబర్లు.. కార్పొరేటర్లు.. మున్సిపల్ చైర్మన్లు.. పరిశీలిస్తారు.. కానీ ఒక డ్రైనేజీ కాలువను ఒక మంత్రి పర్యవేక్షించడం ఎక్కడైనా చూశారా.. ఆ మంత్రి పర్యవేక్షిస్తున్నప్పుడు బందోబస్తు.. దానిని షూట్ చేయడానికి ప్రత్యేకంగా సోషల్ మీడియా టీం.. చదువుతుంటే నవ్వొస్తుంది కదా. ఇక ఇది నిజంగానే జరిగింది. ఆఫ్రికాలో దుర్భరమైన దేశాలు చాలా ఉన్నాయి. […]

Uganda Corruption: మామూలుగా మన ఏరియాలలో డ్రైనేజీ కాలువలను ఎవరు నిర్మిస్తారు.. కాంట్రాక్టర్లు.. వాటిని ఎవరి పర్యవేక్షిస్తారు.. అధికారులు.. కొన్ని సందర్భాలలో సర్పంచ్లు.. వార్డు మెంబర్లు.. కార్పొరేటర్లు.. మున్సిపల్ చైర్మన్లు.. పరిశీలిస్తారు.. కానీ ఒక డ్రైనేజీ కాలువను ఒక మంత్రి పర్యవేక్షించడం ఎక్కడైనా చూశారా.. ఆ మంత్రి పర్యవేక్షిస్తున్నప్పుడు బందోబస్తు.. దానిని షూట్ చేయడానికి ప్రత్యేకంగా సోషల్ మీడియా టీం.. చదువుతుంటే నవ్వొస్తుంది కదా. ఇక ఇది నిజంగానే జరిగింది.

ఆఫ్రికాలో దుర్భరమైన దేశాలు చాలా ఉన్నాయి. అందులో ఉగాండా ఒకటి. ఇక్కడ కరప్షన్ ఒక రేంజ్ లో ఉంటుంది. ప్రభుత్వం ఏదైనా డెవలప్మెంట్ స్కీమ్ కి లేదా డెవలప్మెంట్ వర్క్ కి డబ్బులు కేటాయిస్తే.. సింహభాగానికి మించి అవినీతి జరుగుతూ ఉంటుంది. ఎవరి వాటా వారు తీసుకుంటారు.. చివరికి చేసే పనిలో నాణ్యత ఉండదు. అది అనతి కాలంలోనే కూలిపోతూ ఉంటుంది.. లేదా పనికి రాకుండా పోతుంది. మళ్లీ ఆ డెవలప్మెంట్ స్కీం కి డబ్బులు విడుదల చేస్తారు. మళ్లీ దోచుకోవడం మొదలవుతుంది. ఇలా అక్కడ చర్విత చరణంలాగా అవినీతి వ్యవహారం సాగిపోతూ ఉంటుంది. ఉగాండాలో అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఒక వీడియో ప్రబలమైన నిదర్శనంగా నిలుస్తోంది.

ఉగాండా దేశంలో ఓ ప్రాంతంలో డ్రైనేజీ కాలువను నిర్మించారు. దీనిని సోషల్ మీడియాలో మాత్రం ఒక డ్యామ్ లాగా చెబుతున్నారు.. వాస్తవానికి ఆ వీడియోలో చూస్తున్న దృశ్యాలు చూస్తుంటే అది ఒక డ్రైనేజీ కాలువ లాగా ఉంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మురుగునీటివి తరలించడానికి మధ్యలో ఒక చిన్నపాటి సిమెంట్ దిమ్మె నిర్మించారు. వాస్తవానికి దీనిని స్థానికంగా ఉన్న అధికారులు లేదా ప్రజా ప్రతినిధులు పరిశీలిస్తే సరిపోతుంది. కానీ దీనిని పరిశీలించడానికి ఏకంగా ఒక మహిళా మంత్రి రంగంలోకి వచ్చారు. పైగా ఆమె పరిశీలిస్తున్నప్పుడు వెంట సోషల్ మీడియా వింగ్.. సెక్యూరిటీ.. పోలీసులు.. ఇతర అధికారులు ఉండడం విశేషం. ఈ చిన్నపాటి నిర్మాణాన్ని ఒక డ్యామ్ లాగా అక్కడి ప్రభుత్వం హైలైట్ చేయడం.. ఇక్కడ విశేషం. అవినీతి తారస్థాయిలో ఉంది కాబట్టి ఇక్కడ ఇలాంటి వ్యవహారాలు సాగుతున్నాయని.. చివరికి చిన్నపాటి డ్రైనేజీ కాల్వను కూడా మంత్రి పరిశీలించిందంటే అక్కడ వ్యవహారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని సోషల్ మీడియాలో కామెంట్ లు వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Inside History (@insidehistory)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper