Homeఎంటర్టైన్మెంట్Adivi Sesh Dacoit trailer review: అడివి శేష్ 'డెకాయిట్' ట్రైలర్ రివ్యూ : ఎదో...

Adivi Sesh Dacoit trailer review: అడివి శేష్ ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ : ఎదో ఊహిస్తే.. ఇలా ఉందేంటి..

Adivi Sesh Dacoit trailer review: ‘హిట్ : ది సెకండ్ కేస్’ తర్వాత దాదాపుగా మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత అడివి శేష్(Adivi Sesh) మన ముందుకు ఈ నెల 10 న ‘డెకాయిట్ : ఒక ప్రేమ కథ'(Dacoit Movie) అనే చిత్రం తో రాబోతున్నాడు. ఈ సినిమా పై మొదటి నుండి యూత్ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఎందుకంటే ఈ జనరేషన్ యూత్ కి అడివి శేష్ సినిమాలంటే […]

Adivi Sesh Dacoit trailer review: ‘హిట్ : ది సెకండ్ కేస్’ తర్వాత దాదాపుగా మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత అడివి శేష్(Adivi Sesh) మన ముందుకు ఈ నెల 10 న ‘డెకాయిట్ : ఒక ప్రేమ కథ'(Dacoit Movie) అనే చిత్రం తో రాబోతున్నాడు. ఈ సినిమా పై మొదటి నుండి యూత్ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఎందుకంటే ఈ జనరేషన్ యూత్ కి అడివి శేష్ సినిమాలంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ , ఎందుకంటే ఒక డిఫరెంట్ థియేట్రికల్ అనుభూతిని ఇస్తాడు కాబట్టి, అలాంటిది ఈ సినిమా టీజర్ లో హీరోయిన్ ని చంపాలని అనుకోవడం ఏంటో, మళ్లీ అందులో ప్రేమ కథ ఏంటో , తెలుసుకోవాలంటే థియేటర్స్ లోనే చూడాలి అనే ఆత్రుతని కలిగించేలా చేశారు మేకర్స్. ఇకపోతే కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది.

ఈ ట్రైలర్ ని చూస్తుంటే ఇదొక లవ్ స్టోరీ లాగానే అనిపించింది కానీ , క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా అసలు అనిపించలేదు. వీళ్లిద్దరి మధ్య మంచి ప్రేమానుబంధం ఉన్నట్టుగా చూపించడం, మధ్యలో హీరోయిన్ హీరో ని వదిలేసి వెళ్లిపోవడం , హీరో మళ్లీ హీరోయిన్ జీవితం లోకి రావాలని అనుకోవడం వంటివి ఈ ట్రైలర్ లో చూపించారు. అసలు ఎందుకు హీరో నుండి హీరోయిన్ దూరంగా వెళ్ళిపోయింది?, బ్యాక్ స్టోరీ ఏంటి ? అనేది తెలియాలంటే ఏప్రిల్ 10 వరకు ఆగాల్సిందే. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఎంతటి అద్భుతమైన నటి అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో కూడా ఆమెకు నటించడానికి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికినట్టు అనిపించింది. ఇదంతా పక్కన పెడితే హీరోయిన్ కి మెమరీ లాస్ వచ్చిందా ?, అలాంటప్పుడు హీరో ఎందుకు ఆమెని చంపాలని అనుకుంటున్నాడు?, ఇంతకీ ఈ సినిమాలో అడవి శేష్ నెగెటివ్ గా కనిపించబోతున్నాడా ?, లేదా మృణాల్ ఠాకూర్ నెగెటివ్ గా కనిపించబోతుందా ? అనేది కూడా సస్పెన్స్ ఎలిమెంట్ గా ఉండేలా ఉంది.

వీళ్ళిద్దరిలోనే విలన్ ఉన్నట్లు ట్రైలర్ చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది. అడివి శేష్ ఇందులో రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడు . ఇది పూర్తి స్థాయి థ్రిల్లర్ సినిమా అని చెప్పలేం , అలా అని పూర్తి స్థాయి లవ్ స్టోరీ అని కూడా చెప్పలేం , ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని మాత్రం చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్టు లేక బోసిపోయిన థియేటర్స్ కి ఈ చిత్రం కొత్త ఊపిరి ని ఇస్తుందా లేదా అనేది చూడాలి . మూవీ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by Sesh Adivi (@adivisesh)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper