Homeఆంధ్రప్రదేశ్‌Jagan Mavigun proposal: జగన్ 'మావిగన్' ప్రతిపాదన ఆయనదే..

Jagan Mavigun proposal: జగన్ ‘మావిగన్’ ప్రతిపాదన ఆయనదే..

Jagan Mavigun proposal: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )కొత్త రాజధాని ప్రతిపాదన వెనుక ఉన్నది ఎవరు? ఇప్పుడు ఇదే అంశంపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తన వద్ద ప్లాన్ బి ఉందంటూ బయటపెట్టారు. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరును కలుపుతూ ఒక క్యారీడార్ను రాజధానిగా చెయ్యాలని ప్రతిపాదించారు. మచిలీపట్నంలో MA .. విజయవాడలో VI… గుంటూరులో GUN ను తీసుకొని.. MAVIGUN […]

Jagan Mavigun proposal: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )కొత్త రాజధాని ప్రతిపాదన వెనుక ఉన్నది ఎవరు? ఇప్పుడు ఇదే అంశంపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తన వద్ద ప్లాన్ బి ఉందంటూ బయటపెట్టారు. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరును కలుపుతూ ఒక క్యారీడార్ను రాజధానిగా చెయ్యాలని ప్రతిపాదించారు. మచిలీపట్నంలో MA .. విజయవాడలో VI… గుంటూరులో GUN ను తీసుకొని.. MAVIGUN పేరు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టే కంటే.. వేలకోట్లతో ఈ మూడు నగరాలను కలుపుతూ కొత్త రాజధాని ప్రకటించాలని కోరారు జగన్మోహన్ రెడ్డి.

ఈ సమయంలో తగదు..
అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన సహేతుకంగానే ఉంది. కానీ ఈ సమయంలో ప్రతిపాదించడం మాత్రం సహేతుకం కాదు. ఎందుకంటే జగన్ మధ్యలో ఈ విషయం ఉంటే 2014లో చంద్రబాబు అమరావతిని ప్రతిపాదించినప్పుడు చెప్పి ఉండాలి. లేకుంటే మూడు రాజధానులకు ముందుగానే చెప్పి ఉండాలి. అటు అమరావతిని నిర్వీర్యం చేసి.. ఇటు మూడు రాజధానులు కట్టలేక.. కూటమి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తున్న వేళ.. ఈ మావిగాన్ ప్రతిపాదనపై వ్యతిరేకత పతాక స్థాయికి చేరింది. అయితే జగన్ చెప్పిన ఈ మావిగాన్ ప్రతిపాదనను కొందరు వైసీపీ నేతలు సమర్థిస్తున్నారు. జగన్ చెప్పింది త్వరలో అర్థం అవుతుందని చెబుతున్నారు. కానీ వైసీపీలోనే మెజారిటీ నేతలు ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్లో జరుగుతున్న విస్తృత చర్చ వైసిపికి డ్యామేజ్ చేస్తుందని భావిస్తున్నారు.

Also Read: పవన్ కు తమిళనాడు.. లోకేష్ కు కర్ణాటక.. బిజెపి భారీ వ్యూహం

తప్పుడు సలహా అంటూ మండిపాటు..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలంగా సమర్ధించే చాలామంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. సలహాలు తప్పుగా ఇస్తున్నారని చెబుతున్నారు. జగన్ చుట్టూ కొత్తవారు చేరారని.. వారి ఇచ్చిన స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా చదివేసారని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ఇటువంటి స్క్రిప్టులను తయారు చేసేవారట. అయితే ఆయన విషయంలో చాలా రకాల అభ్యంతరాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉన్నాయి. కానీ ఆయన సలహాలు బాగానే ఉంటాయి అన్నవారు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇది సజ్జల మాట కాదు అని.. కొత్తవారు ఇచ్చిన స్క్రిప్ట్ అని ప్రచారం నడుస్తోంది. మరి సజ్జల కాకుంటే ఎవరు ఇచ్చి ఉంటారు అనేది ఒక అనుమానం.

చెవిరెడ్డి స్క్రిప్ట్..
ఇటీవల సజ్జల ప్లేస్లోకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఎన్నికలకు ముందు ఆయన సర్వేలు చేసి ఇచ్చిన సూచనలతోనే అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి మార్చారని ఒక ప్రచారం ఉంది. ఎందుకంటే ఆయనకు సర్వేలు చేసే అలవాటు ఉంది. వైసీపీలో ఎన్నికల్లో అభ్యర్థుల మార్పు వెనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వే ఉందన్నది ఒక అనుమానం. అంతకుముందు కేసీఆర్ కు సైతం చెవిరెడ్డి సర్వేలు ఇచ్చారని.. అవి తప్పు అని తేలిపోయింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డిని నమ్ముకున్నారు. ఎన్నికల ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఇప్పుడు కూడా సజ్జల స్థానంలో చెవిరెడ్డిని తెచ్చారని.. మావిగన్ ప్రతిపాదన చెవిరెడ్డిదని వైసీపీలో ఒక ప్రచారం ఉంది. అందులో నిజం ఎంత ఉందో తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper