Homeఎంటర్టైన్మెంట్Adivi Sesh Dacoit OTT: ఓటీటీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అడివి శేష్ 'డెకాయిట్'...

Adivi Sesh Dacoit OTT: ఓటీటీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అడివి శేష్ ‘డెకాయిట్’ చిత్రం.. ఎందులో చూడాలంటే..

Adivi Sesh Dacoit OTT: గత నెల 10 వ తారీఖున భారీ అంచనాల నడుమ విడుదలైన అడివి శేష్(Adivi Sesh) ‘డెకాయిట్'(Dacoit Movie) చిత్రానికి మొదట్లో కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి విడుదలకు ముందు 30 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ […]

Adivi Sesh Dacoit OTT: గత నెల 10 వ తారీఖున భారీ అంచనాల నడుమ విడుదలైన అడివి శేష్(Adivi Sesh) ‘డెకాయిట్'(Dacoit Movie) చిత్రానికి మొదట్లో కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి విడుదలకు ముందు 30 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగ్గా, బాక్స్ ఆఫీస్ వద్ద 31 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్స్ లో ఈ చిత్రం విజయవంతంగా రన్ అవుతోంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ విడుదలకు ముందు మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది.

థియేటర్స్ లో విడుదలైన 4 వారాలకు ఓటీటీ విడుదల చెయ్యాలి అనే ఒప్పందం తో ఈ సినిమాని కొనుగోలు చేసింది అమెజాన్ ప్రైమ్ సంస్థ. దాదాపుగా 30 కోట్ల రూపాయలకు ఈ చిత్రం అమ్ముడుపోయింది. విడుదలకు ముందు 15 కోట్ల రూపాయిల అడ్వాన్స్ ఇచ్చారు, ఇప్పుడు థియేటర్స్ లో కూడా సినిమా సూపర్ హిట్ అవ్వడం తో , ఓటీటీ లో విడుదల తర్వాత మరో 15 కోట్ల రూపాయిలు ఇవ్వబోతున్నారు. తెలుగు తో పాటు హిందీ, తమిళం , కన్నడ మరియు మలయాళం భాషల్లో ఈ నెల 8 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కాబోతుంది ఈ చిత్రం. థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం , ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకోబోతుందో చూడాలి.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే హరిదాసు (అడివి శేష్) ఒక హత్య కేసులో నిందితుడిగా దాదాపుగా 13 ఏళ్ళ నుండి జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు అతన్ని కడప జైలు నుండి మరో జైలుకు తరలిస్తుండగా పోలీసుల నుండి తప్పించుకుంటాడు. అందుకు ఇషాద్ భాయ్ (అతుల్ కులకర్ణి) సహాయం చేస్తాడు. జైలు నుండి తప్పుకొచ్చి రాగానే దుబాయి కి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు , దాని కోసం సుమారుగా 60 లక్షల రూపాయిలు పైగానే డబ్బు ఖర్చు అవుతుంది. ఆ డబ్బుని సంపాదించే పనితో పాటు తనని మోసం చేసిన మాజీ ప్రేయసి సరస్వతి(మృణాల్ ఠాకూర్) పై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఆమెని వెట్టుకుంటూ ఇంటికి వెళ్తాడు , ఆ క్షణం లో ఆమె ఆరేళ్ళ బిడ్డకు తల్లి అనే విషయం తెలుసుకొని షాకి గురవుతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేదే స్టోరీ.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper